అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bangkok | థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో (Bangkok) బుధవారం తెల్లవారుజామున ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. వాజిరా హాస్పిటల్ ముందు సమ్సెన్ రోడ్డుపై ఉదయం 6:30 గంటల సమయంలో రోడ్ ఒక్కసారిగా కుంగిపోయింది.
చాలా మంది మొదట చిన్న వాటర్ పైప్ లీక్ అని అనుకున్నా.. క్షణాల్లోనే హాలీవుడ్ సినిమాలో (Hollywood movie) కనిపించేలా భారీ సింక్ హోల్ ఏర్పడింది. కొద్ది క్షణాల్లోనే చిన్న రంధ్రం 50 మీటర్ల లోతు, 30×30 మీటర్ల విస్తీర్ణంలో భారీ గొయ్యి పడింది. ప్రధాన రహదారి కింద భారీ నీటి టన్నెల్ (huge water tunnel) ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ టన్నెల్‌కు నీటిని తరలించే పైప్ ఒకటి పగిలిపోవడంతో, ఆ నీటి ఒత్తిడికి పైన ఉన్న మట్టి మొత్తం కరిగి టన్నెల్‌లోకి వెళ్లిపోయింది. దీంతో రోడ్ పూర్తిగా కుంగిపోయింది.
Bangkok | ఇలా కుంగిపోయిందేంటి..
ఈ ప్రమాదంలో రెండు విద్యుత్ స్తంభాలు కూలాయి. ఒక వైట్ ట్రక్ క్రేటర్ అంచుపై అలా ఉండిపోయింది. స్పార్కులు రావడంతో విద్యుత్, నీటి సరఫరా కట్ చేశారు. ఒక కారు సింక్‌హోల్‌లో పడిపోయింది. 3,500 మందికి పైగా రోగులు, సిబ్బంది, నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలింంచారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా (CC Camera) వీడియోలు, స్థానికుల సెల్‌ఫోన్ ఫుటేజ్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. వాటిలో రోడ్డు క్రమంగా కుంగుతూ కనిపించడం, పైప్‌ల నుంచి నీరు ఊరుతూ ఉండడం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, ఒక వైట్ టో ట్రక్ అంచుపై ఉండడం వంటి దృశ్యాలు మనం గమనించవచ్చు.
వాజిరా హాస్పిటల్ (Vajira Hospital) సిబ్బంది ప్రకారం.. ఇన్‌పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు షిఫ్ట్ చేశారు. హాస్పిటల్ భవనం స్థిరంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఔట్‌పేషెంట్ క్లినిక్స్, స్పెషాలిటీ సర్వీసులు రెండు రోజుల పాటు నిలిపివేశారు. స్పార్కులు రావడంతో విద్యుత్, నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్రమత్తంగా ఉన్న అధికారులు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అంచనాలు వేస్తున్నామని తెలిపారు.
ఈ ప్రమాదం ప్రధాన నీటి టన్నెల్ స్ట్రక్చరల్ వైఫల్యం కారణంగా జరిగిందని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మరింత లోతైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తనిఖీలు (in-depth infrastructure inspections), సురక్షితంగా ప్రయాణించే మార్గాలు రూపొందించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. థాయ్ ప్రభుత్వం, బ్యాంకాక్ మున్సిపల్ అధికారులు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంని ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాల్లో ఇతర టన్నెల్‌లు, పైపుల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపనున్నట్టు ప్రకటించారు.
SHOCKER 🚨 A massive sinkhole about 50 meters deep and 30×30 meters wide SUDDENLY opened this morning in front of Vajira Hospital in Bangkok 😳
Nearby buildings, including the hospital and police station, were evacuated as a precaution. pic.twitter.com/BLEZcACg3i
— Times Algebra (@TimesAlgebraIND) September 24, 2025