అక్షరటుడే, ఆర్మూర్: Aloor | ఆలూరు గ్రామ నూతన గ్రామభివృద్ధి కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ఆలూర్ గ్రామ వీడీసీ అధ్యక్షుడిగా మగ్గిడి సూర్య, ఉపాధ్యక్షులుగా కోయ మహేష్, సమేరా శ్రీను, క్యాషియర్‌గా మిద్దెల హరీష్, బోపేన విజయ్, కార్యదర్శిగా పిట్టల అఖిల్, రవి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అందరి సహకారంతో ఆలూర్ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.