- Advertisement -
HomeజాతీయంMaoists | భారీగా మావోయిస్టుల లొంగుబాటు..

Maoists | భారీగా మావోయిస్టుల లొంగుబాటు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Maoists | ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో (Dantewada district) బుధవారం మావోయిస్టులు భారీగా లొంగిపోయారు. మొత్తం 71 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోగా..

50 మంది పురుషులు, 21మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 30 మందిపై మొత్తం రూ. 64 లక్షల పురస్కారం ఉన్నట్లు సమాచారం. ‘లోన్ వర్రాటు’, ‘పూనా మార్గెమ్’ కార్యక్రమాల్లో భాగంగా ఆయుధాలు వదిలేసి పోలీసులకు లొంగిపోయారు (surrendered).

- Advertisement -

జనజీవన స్రవంతిలో కలిసే వారికి ఉపాధి అవకాశాలు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు (anti-Maoist operations) ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలు చేస్తుండడంతో మావోల కార్యకలాపాలు తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. మావోయిస్టుల ఏరివేతను కేంద్రం తీవ్రం చేస్తుండడంతో వారికి లొంగిపోవడం తప్ప వారికి మరో మార్గం లేదని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోలు గతంలో పలు విధ్వంసక ఘటనల్లో పాల్గొన్నట్లు బస్తర్ ఐజీ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని అక్కడి అధికారులు చెప్పారు.

దంతెవాడ పోలీసు కార్యాలయంలో జరిగిన లొంగుబాటు కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force) అధికారులు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్/బస్తర్ ఫైటర్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ బృందాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లేనని తెలిపారు.

కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి బస్తర్ ప్రాంతంలో (Bastar region) 10,000 కంటే ఎక్కువ మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. ఇక దేశవ్యాప్తంగా 2015 నుంచి 2025 వరకు సుమారు 10 వేల మంది మావోలు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News