ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Private Schools | ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు.. అల్​రెడీ పెంచేసిన పాఠశాలలు

    Private Schools | ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు.. అల్​రెడీ పెంచేసిన పాఠశాలలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని కలలు కంటారు. తమ బిడ్డలు ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తారు. సర్కార్​ బడుల్లో govt schools సరైన పర్యవేక్షణ ఉండదని ప్రైవేట్​ పాఠశాలల్లో private schools చేర్పిస్తారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇష్టారీతిన ఫీజులు fees వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 11,454 ప్రైవేట్ స్కూళ్లుండగా, వాటిలో 34.83 లక్షల మంది చదువుతున్నారు. వీటిలో ఫీజుల వసూళ్లపై ఎలాంటి నియంత్రణ లేదు. దీంతో యాజమాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాటు అవుతోంది.

    Private Schools | ఇష్టం వచ్చినట్లు ఫీజులు

    ఏ పాఠశాలల, ఏ తరగతి ఎంత ఫీజు వసూలు చేయాలనే నిబంధనలు లేకపోవడంతో ఇష్టారీతిగా ఫీజులు తీసుకుంటున్నారు. పాఠశాల యాజమాన్యాలు తమకు నచ్చినంత ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా కుదేలు అవుతున్నారు. గతంలో బీఆర్​ఎస్ brs​ హయాంలో ఫీజుల నియంత్రణ కమిటీ వేసినా.. చర్యలు మాత్రం చేపట్టలేదు.

    Private Schools | విద్యా కమిషన్​ ఏర్పాటు

    కాంగ్రెస్​ ప్రభుత్వం congress govt రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంత్రి శ్రీధర్​బాబు sridhar babu నేతృత్వంలో కేబినెట్​ సబ్ ​కమిటీ వేసింది. దీంతో పాటు విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది. విద్యా కమిషన్ నివేదిక ఇవ్వడంతో.. ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు చట్టం తెస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో పలు పాఠశాలలు ముందుగానే ఫీజులను పెంచేశాయి. 2025–26 విద్యా సంవత్సరానికి 20 నుంచి 50 శాతం దాకా ఫీజులు పెంచేశాయి.

    Private Schools | వసతులు లేకున్నా..

    రాష్ట్రంలోని చాలా ప్రైవేట్​ పాఠశాలల్లో కనీస వసతులు లేవు. పలు బడులను అయితే రేకుల షెడ్డుల్లో నిర్వహిస్తున్నారు. ఆడుకోవడానికి గ్రౌండ్​ ఉండదు. ఇరుకు గదుల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను కూర్చొబెడతారు. అయినా కూడా ఆయా పాఠశాలల్లో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎల్​కేజీ విద్యార్థులకు రూ.పది వేల పైనే ఫీజు తీసుకుంటుండటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థులకు బడులను బట్టి రూ.30 వేల నుంచి రూ.12 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు చట్టం తెస్తుందనే వార్తలతో తల్లిదండ్రులు సంతోష పడేలోపే.. పాఠశాలలు ఫీజులను భారీగా పెంచడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...