- Advertisement -
Homeతాజావార్తలుNizamabad City | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

Nizamabad City | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

- Advertisement -

అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad City | తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు (culture and traditions) ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తోందని పాలిటెక్నిక్​ మహిళా కళాశాల ప్రిన్సిపాల్​ అనురాధ, తెలంగాణ గెజిటెడ్​ ఆఫీసర్స్​ అసోసియేషన్​ జిల్లా కార్యదర్శి సంగం అమృత్​ కుమార్​ అన్నారు. రాష్ట్ర ప్రజా సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా బతుకమ్మ పోస్టర్ల​ను నగరంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్​ కళాశాలలో (Womens Polytechnic College) బుధవారం ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మన సంస్కృతిని తెలియజేస్తుందన్నారు. విద్యార్థినులు ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీజీవో పదాధికారులు దేవిసింగ్, పావని, నాగరాజు, చంద్ర, విజ్నేష్, సరస్వతి, విజయత, సుజాత పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News