ePaper
More
    HomeజాతీయంJio | అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చిన జియో.. సింగిల్ రీఛార్జ్‌తో 11 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్...

    Jio | అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చిన జియో.. సింగిల్ రీఛార్జ్‌తో 11 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఇంకెన్నో!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jio | రిలయన్స్ జియో JIO యూజర్లకు ఎప్పటిక‌ప్పుడు అదిరిపోయే శుభ‌వార్త‌లు అందిస్తూ ఉంటుంది. తాజాగా జియో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ని prepaid recharge plan అందుబాటులోకి తీసుకు రాగా, అందులో రూ. 895 ప్లాన్ ఒకటి ఉంది. ఈ ప్లాన్ ప్ర‌కారం 336 రోజులు అంటే.. 11 నెలల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ముఖ్యంగా జియోఫోన్ JioPhone లేదా జియో భారత్ ఫోన్ jio bharat Phone వంటి ఫీచర్ ఫోన్లు వాడే యూజర్లకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ జియో ప్లాన్ ద్వారా యూజర్లు తమ సిమ్‌ను ఎక్కువ రోజులు యాక్టివ్‌గా ఉంచుకునే అవ‌కాశం ఉంది. దీనితో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ unlimited calling, ఇంటర్నెట్ డేటాను కూడా ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంది.

    Jio | బెస్ట్ ప్లాన్..

    అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ ప్లాన్ ఫీచర్ ఫోన్ Feature phone యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ రూ. 895 ప్లాన్ బెనిఫిట్స్ ఏంట‌నేది చూస్తే.. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అన్ని లోకల్, STD నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్ unlimited calling సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రతి 28 రోజులకు 50 SMS, 2GB డేటా పొందుతారు. 336 రోజుల్లో మొత్తం 24GB డేటా లభిస్తుంది. తక్కువ ఇంటర్నెట్ వాడే యూజర్లకు ఈ డేటా బెస్ట్. బ్రౌజింగ్ browse, సోషల్ మీడియా social media, చాటింగ్, ఇమెయిల్స్ emails చెక్ చేసే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

    ఇక స్మార్ట్‌ఫోన్ యూజర్ల smartphone users కోసం జియో కొన్ని వార్షిక ప్లాన్‌లను Annual Plan అందిస్తోంది. అందులో ఒక‌టి రూ.3,999 ప్లాన్ కాగా, దీని వ్యాలిడిటీ : 365 రోజులు, డేటా : రోజుకు 2.5GB, కాలింగ్ : అన్‌లిమిటెడ్, SMS : రోజుకు 100, OTT : రెండు సబ్‌స్క్రిప్షన్‌లు. మ‌రో ప్లాన్ రూ.3,599 ప్లాన్ దీని వ్యాలిడిటీ : 365 రోజులు, డేటా : రోజుకు 2.5GB, కాలింగ్, SMS : ఎప్పటిలాగే, ఫ్యాన్‌కోడ్ OTT సబ్‌స్క్రిప్షన్ లేదు.మ‌రి ఈ ప్లాన్స్ ఒక‌సారి చెక్ చేసుకొని ఏడాది పాటు ఎంజాయ్ చేసేలా రీచార్జ్ చేసుకోండి.

    More like this

    Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు...

    Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి మృతి

    అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్​ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన...

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...