అక్షరటుడే, బాన్సువాడ : Jukkal | జుక్కల్ నియోజవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (Thota Laxmikantha Rao) కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం (Jukkal Constituency) వెనుకబడిన ప్రాంతమైందని, అభివృద్ధి దిశగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. జుక్కల్ నియోజకవర్గానికి స్వయంగా వచ్చి పరిస్థితులను పరిశీలించాలని ఆహ్వానించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Minister Pemmasani Chandrasekhar) సానుకూలంగా స్పందించి, త్వరలోనే నియోజకవర్గాన్ని సందర్శిస్తానన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.