- Advertisement -
HomeతెలంగాణEPFO | పీఎఫ్​ ఖాతాదారులకు గుడ్​న్యూస్​.. ఏటీఎం నుంచి విత్​ డ్రా ఆప్షన్​ ఎప్పటి నుంచంటే?

EPFO | పీఎఫ్​ ఖాతాదారులకు గుడ్​న్యూస్​.. ఏటీఎం నుంచి విత్​ డ్రా ఆప్షన్​ ఎప్పటి నుంచంటే?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : EPFO | పీఎఫ్​ ఖాతాదారులకు ఈపీఎఫ్​వో(EPFO) సంస్థ త్వరలో మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

పీఎఫ్​ ఖాతాదారులు(PF Account Holders) ఏటీఎం నుంచి నగదు తీసుకునే సదుపాయం తీసుకొస్తామని గతంలో సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి నుంచి ఈ సదుపాయం అమలులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి బోర్డు సభ్యులు అక్టోబర్​ రెండో వారంలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.

- Advertisement -

EPFO | ఎంతో మేలు

ప్రస్తుతం పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోవడానికి ఆన్​లైన్​ ద్వారా క్లెయిమ్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు పాక్షికంగా నగదు విత్​డ్రా చేసుకోవచ్చు. అయితే పీఎఫ్​ ఖాతా(PF Account) నుంచి మాత్రమే నగదు తీసుకునే వీలు ఉంటుంది. పెన్షన్​ విభాగంలో జమైన డబ్బులు తీసుకోరాదు. ఉద్యోగం మానేసిన వారు మాత్రం మొత్తం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. పాక్షికంగా నగదు విత్​ డ్రా కోసం ఏటీఎం ద్వారా సైతం అవకాశం కల్పించాలని కేంద్ర కార్మిక శాఖ(Labor Department) నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

EPFO | అంతా సిద్ధం

ఏటీఎం నుంచి పీఎఫ్​ డబ్బులు తీసుకునే సౌకర్యాన్ని జూన్​ నుంచే తీసుకు రావాలని భావించారు. ఈ మేరకు ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా సిద్ధం చేశారు. అయితే ఎంత మొత్తం తీసుకోవాలనే పరిమితి విషయంలో బోర్టు ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సి ఉంది. దీని కోసం నిర్ణయాన్ని వాయిదా వేశారు. అక్టోబర్​లో జరిగే సమావేశంలో లిమిట్​పై చర్చించిన అనంతరం జనవరి నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నారు. దీని కోసం ఏటీఎం కార్డు మాదిరి కార్డులను కూడా అందించనున్నారు. కాగా ప్రస్తుతం ఈపీఎఫ్‌వోకు 7.8 కోట్లమంది చందాదారులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News