అక్షరటుడే, బాన్సువాడ: Banswada | కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తుందని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు (Agro Industries Chairman Kasula Balaraju) తెలిపారు. చందూర్, మోస్రా మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ (Congress Party) కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారథ్యంలో రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. వాటిని ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉంటేనే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా, మాజీ జెడ్పీటీసీ అంబర్ సింగ్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఖాలెక్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ లక్ష్మణ్, కాంగ్రెస్ చందూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.