- Advertisement -
HomeతెలంగాణHigh Court | ఓజీ టీమ్‌కి షాక్.. టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులను సస్పెండ్ చేసిన...

High Court | ఓజీ టీమ్‌కి షాక్.. టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ OG (ఓజీ) రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ రోజు రాత్రి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడనున్న నేపథ్యంలో, ఈ సినిమా మీద ఉన్న హైప్ స్పష్టంగా కనిపిస్తోంది.

టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండడంతో, OG క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ టికెట్ (Black Ticket) దందా కూడా మొదలైంది. రీసెంట్‌గా OG సినిమా టికెట్లను అధిక ధరలకు అమ్ముతున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌‌లోని (Hyderabad) ఇందిరానగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి, రూ.800 విలువ గల టికెట్‌ను రూ.2,500కు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

High Court | ధ‌ర‌ల పెంపు ర‌ద్దు..

పోలీసులు 25 టిక్కెట్స్ స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం. పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు. నిందితుడిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. అయితే OG సినిమా క్రేజ్ దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం/తదితర సంస్థలు టికెట్ ధరల (Ticket Prices) విషయంలో కొన్ని మార్గదర్శకాలను నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్ షో (సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటలకు): బెనిఫిట్ షో టికెట్ ధర: రూ.1000 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణ‌యించారు. ఇక‌ సెప్టెంబర్ 25 – అక్టోబర్ 4 వరకు: సింగిల్ స్క్రీన్ టికెట్ ధర: రూ.125 (జీఎస్టీతో), మల్టీప్లెక్స్ టికెట్ ధర: రూ.150 (జీఎస్టీతో) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.

ఇక తెలంగాణాలో ప్రీమియ‌ర్ షో (సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు): టికెట్ ధర: రూ.800 (గరిష్టంగా), ఇక సెప్టెంబర్ 25 – అక్టోబర్ 4 వరకు: సింగిల్ స్క్రీన్ టికెట్ ధర: రూ.100, మల్టీప్లెక్స్ టికెట్ ధర: రూ.150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ‘ఓజీ’ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు (High Court) సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చిత్ర బృందం డైలమాలో ప‌డింది. మరికొద్ది నిమిషాల‌లో ఓజీ ప్రీమియ‌ర్ షో ప‌డ‌నున్న నేప‌థ్యంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు పెద్ద షాకింగ్‌గా మారింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News