అక్షరటుడే, ఇందూరు: NCC cadets | జాతీయస్థాయి ఎన్సీసీ ట్రెక్కింగ్ క్యాంప్‌నకు (national level NCC trekking camp) నిజామాబాద్ గ్రూప్ (నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్) నుంచి 51 మంది కేడెట్లు పాల్గొంటున్నారని కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ తెలిపారు.
క్యాంప్ ఈనెల 25 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు తిరుపతిలో (Tirupati) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రెక్కింగ్ అడ్వంచర్ (Trekking Adventure) వంటి జాతీయ క్యాంప్‌లు ఆయా ప్రాంతాల్లో చేయడం వల్ల జాతీయత భావం పెరుగుతుందన్నారు.
ప్రకృతిని, పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుందన్నారు. ఎన్సీసీ అధికారి లెఫ్ట్‌నెంట్ డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ నేషనల్ క్యాంప్‌ల వల్ల ఎన్సీసీ విద్యార్థులకు శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. ప్రధానంగా పట్టుదల, ఆత్మవిశ్వాసం, బృందస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు అలవాడతాయని చెప్పారు. క్యాంప్‌లో నిజామాబాద్ నుంచి 14 మంది పాల్గొంటున్నారని తెలిపారు.