అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam | గిరిజన బాలికల విద్యాభ్యాసానికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులో నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల ఇంటర్, డిగ్రీ వసతి గృహాన్ని (Tribal girls hostel) ఆయన బుధవారం రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ (State Agros Industries) ఛైర్మన్ కాసుల బాలరాజుతో (kasula balaraju) కలిసి ప్రారంభించారు.
MLA Pocharam | బోగ్బండార్ కార్యక్రమం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి చదువు కోసం బాన్సువాడకు వచ్చే గిరిజన బాలికలకు వసతి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ వసతి గృహ నిర్మాణంతో సమస్యలు తీరనున్నాయని స్పష్టం చేశారు.
అనంతరం బాన్సువాడ (banswada), నస్రుల్లాబాద్ మండల బంజారా నాయకులు ఏర్పాటు చేసిన బోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని జగదంబా మాత, సేవాలాల్ మహరాజ్ చిత్రపటాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అధికారి సతీష్, బీర్కూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు దుర్గం శ్యామల, మాజీ ఎంపీపీ విఠల్, బద్యానాయక్, మోహన్ నాయక్, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.