అక్షరటుడే, ఎల్లారెడ్డి/కోటగిరి: Nizamsagar Project | జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజాంసాగర్‌లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. అలాగే ఎగువన సింగూరు, పోచారం ప్రాజెక్ట్‌ల (Pocharam projects) నుంచి వరద వస్తుండడంతో నిజాంసాగర్‌లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 13 గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కుల నీటిని మంజీరలోకి వదులుతున్నారు.
Nizamsagar Project | కొనసాగుతున్న వరద..
నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. జలాశయంలోకి ఎగువ నుంచి 69,859 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 1405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 13.123 అడుగుల (1402.34 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గేట్లు ఎత్తి 1,00,351 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టు కోసం ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు.
Nizamsagar Project | అప్రమత్తంగా ఉండాలని సూచన..
ప్రాజెక్టు గేట్లు ఎత్తినందున మంజీరా పరివాహక ప్రాంతాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు కాల్వల వైపు.. లో లెవల్ వంతెనల వైపు వెళ్లవద్దని పోతంగల్ తహశీల్దార్ గంగాధర్ సూచించారు. మంజీరలో ఇసుక కోసం ఎవరూ వెళ్లవద్దని గట్టిగా హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Nizamsagar Project | పొంగిపొర్లుతున్న వాగు..
మంజీర నీటిప్రవాహం పెరగడంతో పోతంగల్ మండలంలోని కోడిచెర్ల శివారులో ఉన్న కొడిచెర్ల సిర్పూర్ వెళ్లే వాగు పొంగిపొర్లుతోంది.. వాగు వంతెన పైనుంచి నుంచి వరద వెళ్తుండడంతో రిస్క్ తీసుకుని ఎవరూ వాగు దాటవద్దని తహశీల్దార్ సూచించారు.