- Advertisement -
HomeతెలంగాణJubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో అదే రిపీట్​ అవుతుంది.. మంత్రి పొన్నం కీలక...

Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో అదే రిపీట్​ అవుతుంది.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటించారు.

నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల భారీ వర్షాలకు జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో బుధవారం ఉదయం పొన్నం ప్రభాకర్​, మంత్రి వివేక్​ వెంకటస్వామి, జీహెచ్​ఎంసీ కమిషనర్​ ఆర్వీ కర్ణన్​, హైడ్రా కమిషనర్​ రంగనాథ్​(Hydraa Commissioner Ranganath)తో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. షేక్‌పేట్ డివిజన్‌లోని ఓయు కాలనీని సందర్శించారు.

- Advertisement -

Jubilee Hills | కాంగ్రెస్​దే విజయం

మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)​ మాట్లాడుతూ.. కంటోన్మెంట్​ ఉప ఎన్నికల్లో జరిగిందే.. జూబ్లీహిల్స్​లో జరుగుతుందన్నారు. కాగా కంటోన్మెంట్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన లాస్య నందిత మృతి చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపొందిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్(Jubilee Hills)​లో సైతం తామే విజయం సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ గెలుస్తామనే భ్రమల్లో ఉందని ఎద్దేవా చేశారు.

నగరంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు పొన్నం తెలిపారు. అయితే పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనేది హైకమాండ్​ నిర్ణయిస్తుందని చెప్పారు. బీసీ రిజర్వేషన్​(BC Reservation) అంశంపై కోర్టు పరిధిలో ఉందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.

Jubilee Hills | మంత్రుల ఫోకస్​

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్​ ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులను ప్రారంభించింది. మంత్రులు పొన్నం ప్రభాకర్​, వివేక్​ వెంకటస్వామి(Vivek Venkataswamy) నియోజకవర్గంలో నిత్యం తిరుగుతున్నారు. తాజాగా వరద ముంపు ప్రాంతాలను వారు సందర్శించారు. పెండింగ్​ పనులు, స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు తెలిపారు. వరద ముంపుపై స్థానికులతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలని మంత్రులు అధికారులకు సూచించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News