అక్షరటుడే, వెబ్‌డెస్క్ : OG Movie | ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. జ్వరంతో బాధపడుతూనే ఆయన ప్రభుత్వ పనులను కొనసాగించటం విశేషం. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరై, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించారు.
అయితే సోమవారం రాత్రి నుంచి జ్వరం మరింత పెరగడంతో వైద్యులు పరీక్షలు చేసి, పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. ఫీవర్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన శాఖకి సంబంధించిన పనులు ఆపకుండా టెలీ కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సినిమాల పీఆర్ అధికారికంగా ప్రకటించారు.
OG Movie | రిలీజ్‌కి ముందు అనారోగ్యం..
పవర్‌స్టార్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న OG సినిమా(OG Movie) సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఆ ఈవెంట్‌కు పవన్ హాజరై ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. అయితే రిలీజ్‌కు ముందు పవన్ జ్వరంతో ఇబ్బందులు పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు #GetWellSoonPawanKalyan అంటూ ట్రెండ్ చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. OG సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పవన్ పూర్తి ఆరోగ్యంతో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా, ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు లేని విధంగా హాజరై ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చారు. జోరుగా వర్షం కురుస్తున్నా కూడా, భారీగా తరలివచ్చిన అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో వానలో తడుస్తూనే పవన్ కళ్యాణ్ ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. తన ప్రసంగంతో అభిమానులకి మంచి కిక్ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత విజయవాడకు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఆయనకి ప్రత్యేక ఆహ్వానం అందించారు ఆలయ నిర్వాహకులు. ఈ క్రమంలోనే కనకదుర్గమ్మను పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటుగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్ స్వామి కూడా ఉన్నారు.