అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Brain Eating Virus | కేరళ(Kearla)లో ఒక అరుదైన, ప్రాణాంతక బ్యాక్టీరియా సంచలనం సృష్టిస్తోంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా గా పిలవబడే ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ (PAM) అనే వ్యాధి కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 80 కేసులు నమోదయ్యాయి, ఇందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (Health Minister Veena George) వెల్లడించారు.
Brain Eating Virus | పాముకంటే ప్రమాదకరం
ఈ వ్యాధికి కారణమైన అమీబా – నైగ్లేరియా ఫౌలరి (Naegleria Fowleri) అనే సూక్ష్మ జీవి. ఇది మానవ శరీరంలోకి ముక్కు ద్వారా ప్రవేశించి, నేరుగా మెదడుకు చేరి కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఇది వాయురహిత స్థితిలో ఉన్న, నిల్వ నీటిలో ఎక్కువగా ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించదు, కానీ మురికి నీటిలో ఈత కొట్టడం, ముఖానికి నీరు తాకడం వల్ల మెదడుకు చేరుతుంది. ఈ వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 2023 నుంచి ఎన్సెఫలైటిస్ (మెదడు వాపు) లక్షణాలున్న ప్రతి కేసును నిశితంగా పరిశీలించాలనే మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైక్రోబయాలజీ ల్యాబ్‌ల్లో పీసీఆర్ పరీక్షలు ద్వారా అమీబా పరీక్షలు (Amoeba Tests) నిర్వహిస్తున్నారు. 2024లో సాంకేతిక మార్గదర్శకాలు విడుదల చేసి, వ్యాధి నిర్ధారణ, కారణ నిర్ధారణ, చికిత్సలో వేగం పెంచే చర్యలు తీసుకున్నట్లు మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మరోవైపు ప్రజలకి పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. నీటి వనరుల్లో జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు.
నిల్వ ఉన్న నీటిలో అస్సలు ఈత కొట్టకూడదు, మురికి నీటిలో (Water) స్నానం చేయరాదు, స్నానం చేస్తున్నప్పుడు ముక్కులోకి నీరు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇంటి వద్ద, శివారు ప్రాంతాల్లో నీటి ట్యాంకులు క్లోరినేషన్ చేయాలి అని సూచించారు. కేరళ ప్రభుత్వం (Kerala Government) ఈ వ్యాధిని అణిచేందుకు జాతీయ ఆరోగ్య సంస్థలతో కలిసి పనిచేస్తోంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఒక అరుదైన అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. జాగ్రత్త ఒక్కగే ఆయుధం.