అక్షరటుడే, వెబ్డెస్క్ : Ration Shops | రాష్ట్రంలో రేషన్ డీలర్లు (Ration Dealers) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 3 నుంచి దుకాణాలు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు.
తమ డిమాండ్ల సాధన కోసం డీలర్లు సమ్మె బాట పట్టనున్నారు. కమీషన్ బకాయిలు విడుదల చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కొంతకాలంగా డీలర్లు కోరుతున్నారు. ఈ మేరకు ఆగస్టులో ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్ (Civil Supplies Building) ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల సమ్మె నోటీస్ (Strike notice) సైతం అందించారు.
Ration Shops | బకాయిలు చెల్లించాలి
కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో అక్టోబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలు మూసి వేసి నిరసన తెలపాలని నిర్ణయించినట్లు డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజు తెలిపారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో ఉపవాస దీక్షలు చేపట్టి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఆరు నెలల కమీషన్ బకాయిలు రూ.120 కోట్లు, గన్నీ సంచుల డబ్బులు రూ.6 కోట్లు, కేవైసీకి సంబంధించిన రూ.15 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Ration Shops | హామీలు అమలు చేయాలి
ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని డీలర్లు చెబుతున్నారు. బకాయిలు విడుదల చేయడంతో పాటు తక్షణమే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బకాయిలు పేరుకుపోవడంతో దుకాణల అద్దె, హమాలీ కూలి కోసం సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించాలని, కమీషన్ పెంచాలని కోరుతున్నారు.