అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pani Puri | పానీపూరీ అంటే ప్రాణం పెట్టే వాళ్లెందరో. కానీ, ఆ ప్రేమ రోడ్డుమీదే ధర్నా దాకా వెళ్లిందంటే ఆశ్చర్యంగా ఉంది కదా! గుజరాత్‌లోని (Gujarat) వడోదర నగరంలో ఓ మహిళకు తాను ఆర్డర్ చేసిన పానీపూరీలు తక్కువ వచ్చాయని చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయింది.
రెండు పానీపూరీల కోసం నడిరోడ్డుపై కూర్చుని చేసిన ధర్నా ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. ఈ ఘటన వడోదరలోని సుర్‌సాగర్ సరస్సు సమీపంలోని పానీపూరీ బండి వద్ద జరిగింది. రూ.20కి ఆరు పానీపూరీలు (Pani Puri) అని చెప్పిన బండీ ఓనర్, తనకు కేవలం నాలుగు మాత్రమే వేశాడని ఆమహిళ వాదించింది. మిగిలిన రెండు గోల్ గప్పాలు (gol gappa) ఇవ్వాలంటూ గట్టిగా డిమాండ్ చేసింది.
Pani Puri | పానీపూరీ కోసం నిరసన..
అతడు ఎంత నచ్చజెప్పినా వినకుండా, ఆ మహిళ తీవ్ర ఆగ్రహంతో బండి వద్దే గొడవ చేయసాగింది. చివరికి రోడ్డు మీదే కూర్చుని ధర్నాకు దిగింది. “నన్ను న్యాయం కోసం నిలబడనివ్వండి. నాకు ఇవ్వాల్సిన పానీ పూరి ఇవ్వమనండి అంటూ బిగ్గరగా చెప్పడంతో అందరూ ఆగిపోయారు. ఆమె రోడ్డుపై కూర్చోవడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ (Heavy Traffic) నిలిచిపోయింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడటంతో, అక్కడి ప్రజలు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మాత్రం వినకుండా అక్కడే గంటల పాటు కూర్చుని పోరాటం చేసింది. స్థానికులు ఈ దృశ్యాన్ని ఫోన్‌లలో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, వీడియో వైరల్ అయింది.
అంతలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఓవైపు ఏడుస్తూ, మరోవైపు వాదిస్తూ, “నేను డబ్బు చెల్లించాను, నన్ను మోసం చేశారు. నాకు న్యాయం కావాలి” అంటూ పట్టుదలగా నిలబడింది. చివరికి పోలీసులు ఆమెను రోడ్డుపై నుండి పక్కకు తీసుకెళ్లడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.
ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ, సీరియస్ కామెంట్లు (comments) పెడుతున్నారు.”రెండు పానీపూరీల కోసం దేశమంతా ఊగిపోతే ఎలా?”, “పానీపూరీకి ఈ స్థాయిలో పిచ్చి ఉంటుందని తెలీదు!, “ఇది పానీపూరీ లవ్ స్టోరీ 2025 వర్షన్! అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఆమెకు చివరికి ఆ రెండు పానీపూరీలు తిన్నారా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. మొత్తానికి.. ఈ ఘటన .. పానీపూరీ ఓ స్నాక్ Snack కాదు, అది ఒక ఎమోషన్ అని నిరూపించింది.
View this post on Instagram