- Advertisement -
Homeఆంధప్రదేశ్Earthquake | ఏపీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Earthquake | ఏపీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఏపీలోని ప్రకాశం (Prakasham) జిల్లా ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

- Advertisement -

Earthquake | 3.4 తీవ్రతతో..

ఒంగోలు (Ongole) పట్టణంలోని విజయ్ నగర్ కాలనీ, వడ్డేపాలెం, గాయత్రీ నగర్, భాగ్యనగర్, శ్రీరామపురం, సీఎస్ఆర్ శర్మ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. రిక్టార్​ స్కేల్​పై 3.4 తీవ్రతతో భూకంపం చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

Earthquake | గతంలో సైతం..

గతంలో సైతం ప్రకాశం జిల్లాలో భూకంపం చోటు చేసుకుంది. మే నెలలో భూ ప్రకంపనలు సంభవించాయి. పొదిలి, దర్శి, మండ్లమూరు మండలాల్లో అప్పుడు భూమి కంపించింది. దర్శి నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్​లో నాలుగు రోజుల పాటు వరుసగా భూమి కంపించింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News