- Advertisement -
HomeజాతీయంWinter Season | ఈ సారి చ‌లికి గ‌జగ‌జ వ‌ణకాల్సిందేన‌ట‌.. అందుకు కార‌ణాలు ఏమంటే.!

Winter Season | ఈ సారి చ‌లికి గ‌జగ‌జ వ‌ణకాల్సిందేన‌ట‌.. అందుకు కార‌ణాలు ఏమంటే.!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Winter Season | ఈ ఏడాది దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసిన నేపథ్యంలో శీతాకాలం (వింటర్ సీజన్) తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో (North India) తీవ్రమైన చలి ఎదురయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇందుకు ప్రధాన కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో (Pacific Ocean) అభివృద్ధి చెందుతున్న “లా నినా” పరిస్థితులను పేర్కొంటున్నారు. లా నినా (La Nina) అనేది ప్రకృతిలో సహజంగా వచ్చే వాతావరణ మార్పులలో ఒకటి. ఇది భూమధ్యరేఖ పసిఫిక్ సముద్రంలో సగటు కంటే చల్లటి సముద్ర ఉష్ణోగ్రతలు కనిపించడాన్ని సూచిస్తుంది. ఇది ఎల్ నినోకి పూర్తి భిన్నం – ఎల్ నినోలో సముద్రం వేడిగా ఉంటుంది, లా నినాలో చల్లగా ఉంటుంది.

- Advertisement -

Winter Season | లా నినా ప్రభావం ఖాయం?

యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ వాతావరణ అంచనా కేంద్రం ప్రకారం, అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య లా నినా అభివృద్ధి చెందే అవకాశాలు 71 శాతంగా ఉన్నాయని అంచనా వేసింది. ఇదే విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization) కూడా ధృవీకరించింది. సెప్టెంబర్ ప్రారంభంలోనే లా నినా ప్రారంభమైందని ప్రకటించింది. భారతదేశంపై ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే.. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. లా నినా ప్రభావం వల్ల ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబరు నెలల్లో మంచు కురిసే (snowfall) అవకాశాలు, చలిగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు, గతంలో ఎన్నడూ లేనంతగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.

భారతదేశం భూమధ్యరేఖకు సమీపంలో ఉన్నందున, పసిఫిక్ సముద్రంలో లా నినా ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని పసిఫిక్ మెరైన్ ఎన్విరాన్‌మెంట్ ల్యాబ్ (Pacific Marine Environment Lab) పేర్కొంది. త్వరలోనే ప్రారంభం కానున్న శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు తాము ధ‌రించే దుస్తులు, ఆరోగ్యం (Health), ప‌లు ఉత్పత్తుల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

వయసు మీదపడ్డవారు, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలున్నవారు చలి తీవ్రతను తట్టుకోలేకపోవచ్చు. కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి ఈ సంవత్సరం శీతాకాలం ఇంత‌కు ముందుకన్నా మ‌రింత ఎక్కువ‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశం క‌నిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News