- Advertisement -
Homeబిజినెస్​Global markets losses | నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Global markets losses | నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Global markets losses | యూఎస్‌ ఫెడరల్‌(US Fed) రిజర్వ్‌ చైర్మన్‌ పొవెల్‌ ప్రసంగం తర్వాత గత ట్రేడిరగ్‌ సెషన్‌()లో యూఎస్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. యూరోపియన్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. యూఎస్‌ మార్కెట్ల ప్రభావం బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లపైనా కనిపిస్తోంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) నెగెటివ్‌గా ఉంది.

Global markets losses | యూఎస్‌ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 0.95 శాతం, ఎస్‌అండ్‌పీ 0.5 శాతం లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.14 శాతం లాభంతో సాగుతోంది.

- Advertisement -

Global markets losses | యూరోప్‌ మార్కెట్లు..

సీఏసీ 0.67 శాతం, డీఏఎక్స్‌ 0.44 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.05 శాతం లాభాలతో ముగిశాయి.

Global markets losses | ఆసియా మార్కెట్లు..

బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాల్లో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌(Hang Seng) 0.24 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.05 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. సౌత్‌ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.06 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.76 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.40 శాతం, సింగపూర్‌ ఎక్స్ఛేంజ్‌ స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.13 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 0.21 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు గ్యాప్‌ డౌన్‌()లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐలు వరుసగా రెండో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 3,551 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయిచారు. డీఐఐ(DII)లు వరుసగా 21వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో రూ. 2,670 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.

  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.72 నుంచి 0.97 కు పెరిగింది. విక్స్‌(VIX) 0.64 శాతం పెరిగి 10.63 వద్ద ఉంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 67.79 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 43 పైసలు బలహీనపడి 88.75 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.12 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.34 వద్ద కొనసాగుతున్నాయి.

యూఎస్‌ హెచ్‌ 1 బీ వీసా ఫీజు పెంపు, భారత్‌ యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలలో అనిశ్చితితో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే అధిక నైపుణ్యం కలిగిన, మెరుగైన వేతనం పొందే విదేశీ కార్మికులకు ప్రాధాన్యతనిస్తూ హెచ్‌ 1 బీ వీసా ఎంపిక ప్రక్రియను పునరుద్ధరించనుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మెరుగుపడే అవకాశాలున్నాయి. దీనికితోడు జీఎస్టీ సంస్కరణల(GST reforms)తో ఆయా ఉత్పత్తులకు దేశీయంగా డిమాండ్‌ పెరిగి మార్కెట్లు పుంజుకుంటాయన్న ఆశాభావం అనలిస్టులలో వ్యక్తమవుతోంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News