అక్షరటుడే, తిరుమల: Srivari Brahmotsavams | తిరుమల Tirumala శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బుధవారం (సెప్టెంబరు 24) నుంచి అక్టోబరు 2 వరకు ఈ బ్రహ్మోత్సవాలు ఉంటాయి.

ఈ నేపథ్యంలో ఉత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా Sastroktam అంకురార్పణ నిర్వహించారు. శ్రీవారి తరఫున సేనాధిపతి విష్వక్సేనుల Senadhipathi Vishwaksena వారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. నాలుగు మాఢ వీధు Mada streets ల్లో తిరుగుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు జరిపారు. తదుపరి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా Vaikhanasa Agamoktham అంకురార్పణ ఘట్టం పూర్తిచేశారు.

Srivari Brahmotsavams | అంకురార్పణ అంటే..
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. ఇందులో ప్రధాన ఘట్టం విత్తనాలు మొలకెత్తడం. ఈ మొలకెత్తడాన్నే అంకురార్పణగా పేర్కొంటారు.

ఉత్సవాలు వైభవంగా జరగాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఈ ఘట్టం ఉద్దేశం కూడా అదే. మరో విశేషమేమిటంటే సూర్యుడు అస్తమించిన తర్వాత అంకురార్పణ జరపడం.

జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’గా పిలుస్తారు. అందువల్ల పగటివేళ అంకురాలను అర్పించడం చేయరు. సాయంత్రం వేళ సుముహూర్తంలో అంకురార్పణ చేస్తారు.
ఇక మరో విషయానికి వస్తే.. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను ఉపయోగిస్తారు. యాగశాలలో ఈ క్రతువు ఉంటుంది.

మహర్షి అత్రి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రతువును వివరించారు. ఈ గ్రంథం ప్రకారం.. అంకురార్పణ జరిపే ప్రదేశాన్ని ఆవు పేడతో చక్కగా అలుకుతారు.
తదుపరి బ్రహ్మపీఠం ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత బ్రహ్మ, గరుడ, సుదర్శన, శేష, వక్రతుండ, శంత, ఇంద్ర, సోమ, ఇసాన, జయ తదితర దేవతలకు ఆహ్వానం పలుకుతారు.

తర్వాత భూదేవిని ప్రార్థిస్తూ పాలికలను మట్టితో భర్తీ చేస్తారు. చంద్రుడిని ప్రార్థిస్తూ విత్తనాలు చల్లుతారు. అనంతరం పాలికలకు నూతన వస్త్రం అలంకరించి పుణ్యాహవచనం చేస్తారు.
అనంతరం విష్ణుసూక్తం, సోమరాజ మంత్రం, వరుణ మంత్రం పఠిస్తారు. నిత్యం ఈ పాలికల్లో కొద్దిగా నీరు పడతారు. ఇదంతా మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రోచ్ఛారణలో కొనసాగుతుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో పీహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.