అక్షరటుడే, వెబ్‌డెస్క్: H-1B visa fee hike effect | ఇటలీలోని ప్రపంచ సుందర నగరం రోమ్‌లో రొమాంటిక్‌గా ఎంజాయ్ చేస్తున్న భారత సంతతికి చెందిన అమెరికా జంట (Indian-American couple) కు H-1B వీసా రుసుము పెంపు షాకిచ్చింది.
వీసా రుసుము పెంపు విషయం తెలిసిన వెంటనే తన ప్రియురాలిని రోమ్‌లోనే వదిలేసి యూఎస్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఖంగుతిన్న ప్రియురాలి తన వేదనను ఇన్‌స్టా Instagram వేదికగా పంచుకుంది. అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.
H-1B visa fee hike effect | సమస్య ఏమిటంటే..
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాపై తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డరు పాస్ చేశారు. దీని ప్రకారం.. వీసా VISA ఫీజును $100,000 (దాదాపు రూ. 83 లక్షలు)కు పెంచారు. ఈ ఆర్డరు సెప్టెంబరు 21 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది.
ఆర్డరు పాస్ చేసే సమయంలో అమెరికాకు చెందిన భారత సంతతి జంట ఇటలీ Italy లోని రోమ్ Rome నగరంలో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
మంచి ఎంజాయ్ మూడ్‌లో ఉన్న ఆ జంటకు ట్రంప్ తాజా ఆర్డరుతో షాక్ ఇచ్చారు. ట్రంప్ ఆర్డరు పాస్ చేసే సమయంలో శనివారం మధ్యాహ్నం అవుతోంది.
అదే రోజు అర్ధరాత్రి నుంచి కొత్త ఆర్డరు అమల్లోకి రానుంది. దీంతో ఖంగుతిన్న ప్రియుడు తన ప్రియురాలిని అక్కడే వదిలి, వెంటనే అమెరికా బయలుదేరి వెళ్లాడు.
ఈ విషయాన్ని ప్రియురాలు రిష్ ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ”రోమ్‌లో ఇటాలియన్ పాస్తా తయారీ క్లాస్‌లో ఉన్న సమయంలో వీసా ఫీజు పెంపు విషయం తెలిసింది.
దీంతో నా ప్రియుడు క్లాస్‌ను మధ్యలోనే వదిలేశాడు. నన్ను కూడా వదిలేశాడు. చివరికి రోమ్ నగరాన్ని కూడా వదిలేసి అమెరికాకు వెళ్లిపోయాడు..” అని చెప్పుకొచ్చింది.
“ఇది నా ఒక్కదాని విషయమే కాదు.. ఇలా ఎంత మందిపై ఈ వీసా ఫీజు ప్రభావం చూపిందో..” అని రిష్ పేర్కొంది.
ట్రంప్ హఠాత్ నిర్ణయానికి H-1B వీసాదారుల్లో.. ముఖ్యంగా 70 శాతానికి పైగా ఉన్న భారతీయుల్లో ఆందోళన నెలకొంది. తర్వాత ఇది వార్షిక ఫీజు కాదని, ఒకేసారి కట్టేదని వైట్‌హౌస్ ప్రకటించడంతో కాస్త ఉపశమం పొందారు.
https://www.instagram.com/lifeofrgr/?utm_source=ig_embed&ig_rid=05ce587e-5a25-43fa-9d3c-0b191fc99f48