అక్షరటుడే, హైదరాబాద్: Nanabiyyam Bathukamma | తెలంగాణ Telangana సంస్కృతి culture, సంప్రదాయాల traditions కు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి.
తొమ్మిది రోజుల పాటు తెలంగాణ వీధుల్లో సందడి చేసే ఈ పూల పండుగ, తొలి రోజున ఎంగిలిపూల Engilipoola బతుకమ్మతో ప్రారంభమైంది.
ఇప్పటికే ఎంగిలిపువ్వు, అటుకుల, ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఇక నాలుగో రోజున అంటే బుధవారం తెలంగాణ ఆడపడుచులు నానబియ్యం బతుకమ్మగా పూజిస్తూ ఆడబోతున్నారు.
ఈ రోజు తంగేడు, గునుగు వంటి పూలతో నాలుగంతరాల బతుకమ్మను అందంగా పేరుస్తారు. పీఠంపై గౌరమ్మ Gouramma ను నిలిపి పూజిస్తారు. ఈ రోజు ప్రధాన నైవేద్యం నానబియ్యం.
Nanabiyyam Bathukamma | నైవేద్యంగా..
రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చక్కెరతో కలిపి ముద్దలుగా చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఈ నైవేద్యాన్ని వాయనంగా అందరికీ పంచుతారు.
బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను నిర్వహించుకుంటారు.
మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తూ బతుకమ్మ పండుగ ప్రజల జీవితంలో భాగమైంది. తొమ్మిది రోజులు కొనసాగే ఈ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.
[…] […]