- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిGPO certify | కుల, ఆదాయ ధ్రువ పత్రాల జారీకి కొత్త నిబంధనలు.. మొదట జీపీవో...

GPO certify | కుల, ఆదాయ ధ్రువ పత్రాల జారీకి కొత్త నిబంధనలు.. మొదట జీపీవో ధ్రువీకరించాల్సిందే..!

- Advertisement -

అక్షరటుడే, గాంధారి: GPO certify | ఇటీవలే తెలంగాణ Telangana రాష్ట్రంలోని పల్లెల్లో జీపీవోలు అధికార బాధ్యతలు చేపట్టారు. వారికి అప్పుడే పనులు కూడా అప్పజెప్పారు.

ఇకపై కులం, ఆదాయ ధ్రువపత్రాలు పొందాలంటే.. జీపీవో GPO లు ధ్రువీకరిస్తేనే.. తహసీల్దారు కార్యాలయం నుంచి ధ్రువపత్రాలు జారీ చేస్తారు.

- Advertisement -

ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం government ఉత్తర్వులు కూడా జారీ చేసిందని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తహసీల్దారు రేణుకా చావన్​ తెలిపారు.

GPO certify | ప్రాసెస్​ ఇలా..

  • ప్రజలు మొదట జీపీవో వద్దకు వెళ్లాలి.
  • జీపీవో నుంచి ధ్రువీకరణ తీసుకోవాలి.
  • తర్వాత ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.
  • అటు పిమ్మట ఆ దరఖాస్తు తహసీల్దారు కార్యాలయానికి చేరుకుంటుంది.
  • తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ పరిశీలించి, తహసీల్దారు పరిశీలనకు పంపుతారు.
  • ఇక చివరగా తహసీల్దారు Tahsildar పరిశీలించి సంతకం చేస్తారు.
  • తహసీల్దారు సంతకం పూర్తయ్యాక.. ఆన్​లైన్​లో ధ్రువపత్రాలను డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

GPO certify | కొత్త నిబంధనలు పాటించాలి : రేణుకా చావన్, తహసీల్దారు (గాంధారి)

ప్రభుత్వం కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఆయా గ్రామాల ప్రజలు తమకు కావాల్సిన ధ్రువపత్రాల కోసం మొదట జీపీవోను సంప్రదించాలి. ఆ తర్వాతే ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే వాటిని తిరస్కరించబడతాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News