- Advertisement -
HomeజాతీయంGold Price | దూసుకుపోతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే?

Gold Price | దూసుకుపోతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Price | బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గత కొంతకాలంగా బంగారం ధరలు (Gold Rates) పెరుగుతూనే ఉన్నాయి. రూ.లక్ష దగ్గర కొద్ది రోజుల పాటు ఉన్న బంగారం ధరలు ఇటీవల మళ్లీ పరుగు అందుకున్నాయి. తాజాగా మంగళవారం ఒక్కరోజే ఏకంగా తులం బంగారం రూ.2,700 పెరగడం గమనార్హం. 24 క్యారెట్ల పసిడి రేట్లు లక్షా 19 వేలకు చేరువయ్యాయి. ఢిల్లీలో బంగారం ధరలు తులానికి రూ.1,18,900 గా ఉంది. దీంతో త్వరలోనే రూ.1.20 లక్షలు దాటనుంది. మరోవైపు వెండి ధరలు (Silver Price) సైతం భారీగా పెరుగుతున్నాయి. కిలో వెండి ధర మంగళవారం రూ.3,320 పెరిగింది. ప్రస్తుతం రూ.1,39,600 పలుకుతోంది.

- Advertisement -

Gold Price | ఆందోళనలో సామాన్యులు

పసిడి ధరలు పరుగులు పెడుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో మహిళలకు బంగారంపై ఉన్న ఆసక్తి గురించి తెలిసిందే. ముఖ్యంగా పెళ్లిల సమయంలో తల్లిదండ్రులు తమ కుమార్తెలకు కాట్నకానుకలు సమర్పించే సమయంలో బంగారం పెడుతుంటారు. త్వరలో పెళ్లిల సీజన్​ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుంచే బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే పెరుగుతున్న రేట్లతో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Gold Price | కొనాలా.. ఆగాలా

చాలా మంది బంగారం కొనడానికి సంకొచిస్తున్నారు. అత్యవసరం అయిన వారు కొనుగోలు చేస్తున్నారు. మిగతా వారు మాత్రం భారీగా ధరలు పెరగడంతో ఇంకా పెరుగుతాయా.. లేక తగ్గుతాయా అని ఆలోచించి కొనడం లేదు. మరోవైపు రేట్లు పెరగడంతో బంగారం దుకాణాలకు గిరాకీ కూడా రావడం లేదు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News