అక్షరటుడే, వెబ్డెస్క్ : AP High Court | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రూప్–2 నియామకాలపై (Group-2 appointments) ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో 905 గ్రూప్–2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు (prelims and mains examinations) నిర్వహించింది. ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్షలు జరగ్గా.. ఏప్రిల్ 5న ఫలితాలు విడుదల అయ్యాయి.
AP High Court | రద్దు చేయాలని కోర్టుకు..
గ్రూప్–2 మెయిన్స్ ఫలితాలు (Group-2 mains results) విడుదల అవడంతో కమిషన్ ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. సాధారణ, స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 2,517 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఎంపిక కానీ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు.
అభ్యర్థులు, ఏపీపీఎస్సీ వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అప్పటి వరకు గ్రూప్–2 నియామకాలపై ముందకు వెళ్లొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా తెలంగాణలో సైతం ఇటీవల గ్రూప్–1 ఫలితాలు, ర్యాంకులను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.