- Advertisement -
Homeఅంతర్జాతీయంDonald Trump | ట్రంప్ నిర్ణయాలు.. భారత్‌కు మేలు.. సుంకాలు, వీసా రుసుముల పెంపుతో వారికే...

Donald Trump | ట్రంప్ నిర్ణయాలు.. భారత్‌కు మేలు.. సుంకాలు, వీసా రుసుముల పెంపుతో వారికే నష్టం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | మొన్న సుంకాల పెంపు.. ఇప్పుడు H-1B వీసాలపై భారీగా వడ్డింపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) నిర్ణయాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అగ్రరాజ్యాన్ని దారుణంగా దెబ్బకొట్టనున్నాయి. అదే సమయంలో ఇండియాకు ఎంతో ప్రయోజనం చేకూర్చనున్నాయి. మొన్న సుంకాలు విధించిన ట్రంప్.. తాజాగా వీసాలపై భారీగా రుసుములు పెంచేశారు.

అమెరికాలోని కంపెనీలు ఇప్పుడు ప్రతి H-1B వీసాకు (H-1B visa) 100,000 డాలర్లు లేదా దాదాపు రూ.88 లక్షల మేర చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ నిర్ణయం ప్రధానంగా భారతీయులపై తీవ్ర ప్రభావితం చూపనుంది. ఎందుకంటే అమెరికా (America) జారీ చేసే H-1B వీసాలు పొందుతున్న వారిలో మనవాళ్లే అత్యధికంగా ఉన్నారు. 2024లో జారీ చేసిన వీసాలలో 71 శాతం ఇండియన్లే దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

- Advertisement -

Donald Trump | ‘సిలికాన్ వ్యాలీయే ఉండదు..’

H-1B వీసాల ద్వారా దేశంలోకి వస్తున్న వ్యక్తులు అత్యధిక అధిక నైపుణ్యం కలిగిన వారు అని, వారి వల్ల అమెరికన్లకు ఉపాధి దొరకడం లేదని ట్రంప్ పాలకవర్గం చెబుతోంది. విదేశీయులను తగ్గించడంతో పాటు స్థానికులకు అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోనే వీసా రుసుము (visa fee) పెంచినట్లు పేర్కొంది. అయితే, ట్రంప్ నిర్ణయం అమెరికాను దెబ్బతీస్తుందని అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

H-1Bని “జీనియస్ వీసా” అని అభివర్ణించిన ప్రఖ్యాత అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ మిచియో కాకు.. ట్రంప్ చర్యను వినాశకరమైనదిగా హెచ్చరించారు. ఇది అమెరికా శాస్త్రీయ వ్యవస్థను (American scientific system) నాశనం చేస్తుందన్నారు. ట్రంప్ పరిపాలన తాజా నిర్ణయం అమెరికా టెక్ పరిశ్రమలో ఆవిష్కరణలు, వృద్ధిని ప్రభావితం చేస్తుందని, ఎందుకంటే ఇది ప్రపంచ ప్రతిభపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని గుర్తు చేశారు.

అమెరికా దగ్గర ఒక రహస్య ఆయుధం ఉంది. ఆ రహస్య ఆయుధం పేరు H-1B. ఇవి లేకుండా అమెరికా శాస్త్రీయ, సాంకేతిక రంగం మొత్తం కుప్పకూలిపోతుంది. గూగుల్ లేదా సిలికాన్ వ్యాలీ గురించి ఇక మర్చిపోవాల్సి వస్తుంది. H-1B వీసా లేకుండా సిలికాన్ వ్యాలీ (Silicon Valley) ఉండదు. H-1B అంటే ఏమిటో మీకు తెలుసా? అది జీనియస్ వీసా,” అని మిచియో కాకు చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది.

Donald Trump | ఇండియాకు జాక్ పాట్..

ట్రంప్ నిర్ణయం ఇండియాకు ఒక రకంగా భారీ జాక్ పాట్ అవకాశంగా చెబుతున్నారు. H-1B వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచాలనే ట్రంప్ పరిపాలన నిర్ణయం రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్కు దారి తీస్తుందన్న భావన నెలకొంది. ఎందుకంటే అధిక నైపుణ్యం కలిగిన నిపుణులంతా తిరిగి స్వదేశానికి తిరిగి రావచ్చు. వారి ప్రతిభ “మేక్ ఇన్ ఇండియా” (Make in India) వంటి ప్రభుత్వ చొరవలను పెంచుతుంది. గతంలో అమెరికాపై దృష్టి సారించిన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి కంపెనీలు ఇప్పుడు భారతదేశంలో అధునాతన సౌకర్యాలు, ఆవిష్కరణ కేంద్రాలను నిర్మించడానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు, ఇది మన సాంకేతిక రంగంలో గణనీయమైన మార్పులకు దారి తీస్తుంది.

తక్కువ ఖర్చు, అత్యధిక నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి కారణంగా H-1B వీసాలపై ఆధారపడటం తగ్గడం వల్ల కంపెనీలు ఇండియా మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారుస్తాయి. ఇది భారతీయ నిపుణులకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తుంచి, అదనపు విదేశీ పెట్టుబడులను (foreign investment) ఆకర్షిస్తుంది.

Donald Trump | బలమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ కలిగిన ఇండియాకు.. ట్రంప్ నిర్ణయాలు మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందన్న భావన నెలకొంది. స్వదేశానికి తిరిగి వచ్చే అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు భారతీయ స్టార్టప్లలో పనిచేయడానికి లేదా స్వంత కంపెనీలను ప్రారంభించడానికి ముందుకు రావొచ్చు. ఇది స్థానిక ఆవిష్కరణలను పెంచుతుంది. భారతీయ స్టార్టప్లు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడాన్ని సులభతరం చేస్తుంది. తద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లు (Global investors) భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థపై దృష్టి పెడతారు, చాలా తక్కువ ఖర్చుతో అత్యంత నైపుణ్యం కలిగిన సేవలను అందించగల మన సామర్థ్యాన్ని గుర్తిస్తారు.

Donald Trump | దూసుకెళ్లనున్న ఇండియా

ట్రంప్ నిర్ణయాలు ఇండియాకు అనుచిత లబ్ధి చేకూర్చుతాయని నీతీ ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ (Aayog Amitabh Kant) అభిప్రాయపడ్డారు. ట్రంప్ చర్యలు అమెరికా ఆవిష్కరణలు, వృద్ధిని ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నారు. అదే సమయంలో ఇండియా టర్బో చార్జ్ తో దూసుకెళ్తుందన్నారు.

” H-1B వీసాకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలన్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అదే సమయంలో భారతదేశాన్ని టర్బో చార్జ్ చేస్తుంది. ప్రపంచ ప్రతిభకు తలుపులు వేయడం ద్వారా అమెరికా తదుపరి ల్యాబ్లు, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్లను బెంగళూరు, హైదరాబాద్, పూణే మరియు గుర్గావ్​లకు నెట్టి వేస్తుంది. భారతదేశంలోని అత్యుత్తమ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు వికసిత భారత్ వైపు దేశ వృద్ధికి, పురోగతికి దోహదపడే అవకాశాన్ని కలిగి ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News