అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MP Arvind | జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) పరిశీలించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వేస్టేషన్లో పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.
ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తాతో (Urban MLA Suryanarayana Gupta) కలిసి నిజామాబాద్ రైల్వే స్టేషన్లో పనులను పరిశీలించారు. స్టేషన్లో బుకింగ్ కౌంటర్, వెహికల్ పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot over bridge), వెయిటింగ్ హాల్, పార్సిల్ ఆఫీస్లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, దిశ కమిటీ సభ్యులు హనుమంతరావు, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.