- Advertisement -
HomeతెలంగాణAshwini Vaishnav | అక్టోబర్ 15 నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రైల్వే మంత్రి అశ్వినీ...

Ashwini Vaishnav | అక్టోబర్ 15 నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ashwini Vaishnav | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం(Central Government) వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ స్లీపర్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.

ప్రస్తుతం ట్రయల్ రన్ లో ఉన్న వందేభారత్ స్లీపర్ రైళ్ల(Vande Bharat Sleeper Trains)ను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం వెల్లడించారు. రెండో రైలు ఆపరేషన్ కు సిద్ధమైన తర్వాత వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 15 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న బీహార్ రాష్ట్రం నుంచే వీటి కార్యకలాపాలు నిర్వహించే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Ashwini Vaishnav | ప్రారంభానికి సిద్ధం..

వందేభారత్ స్లీపర్ రైలు ఒకటి ఇప్పటికే సిద్ధమైంది. అవసరమైన ట్రయల్ రన్స్, ఇతర పరీక్షలు నిర్వహించుకుని ఢిల్లీలోని షకుర్ బస్తీ డిపో(Shakur Basti Depot)లో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయితే, రెండు స్లీపర్ రైళ్లను ఒకేసారి ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. అందుకోసమే వీటి ప్రారంభోత్సవాన్ని వచ్చే నెలకు వాయిదా వేసింది. ‘‘రెండు రైళ్లను కలిపి ఒకేసారి ప్రారంభిస్తాం. రెగ్యులర్ సర్వీసులను నిర్వహించడానికి రెండో రైలు అవసరం. అందుకే మేము రెండోదాని కోసం వేచి ఉన్నాం. అది పూర్తయి మా వద్దకు వచ్చిన తర్వాత ప్రారంభిస్తాం. ఏ మార్గంలో నడపాలన్నది నిర్ణయించుకుని రైళ్లను ప్రారంభిస్తామని’’ అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) తెలిపారు. బీహార్​ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఢిల్లీ – పాట్నా మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపనున్నట్లు సమాచారం.

Ashwini Vaishnav | పంజాబ్​లో కొత్త రైల్వే లైన్

పంజాబ్​లోని రాజ్ పుర, మొహాలి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అదనంగా, ఫిరోజ్పూర్ కాంట్-భటిండా-పాటియాలా-ఢిల్లీ మార్గంలో కొత్త వందే భారత్ ఎక్స్​ప్రెస్​ రైలును నడపాలనే ప్రతిపాదనను కూడా వెల్లడించారు. ఈ రైలు 486 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6.40 గంటల్లోనే ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతుంది. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. పంజాబ్ రైల్వే రంగంలో పెట్టుబడి అపూర్వమైన వృద్ధిని సాధించిందని వైష్ణవ్ పేర్కొన్నారు. 2009- 2014 మధ్య పెట్టుబడి కేవలం రూ. 225 కోట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు అది రూ. 5,421 కోట్లకు పెరిగిందన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News