అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad MP | జీఎస్టీ తగ్గింపు అనేది పీఎం మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక అని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) పేర్కొన్నారు.
99శాతం వస్తువులపై జీఎస్టీ భారీగా తగ్గిందన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. దేశంలోని అన్నివర్గాల ప్రజలకు జీఎస్టీ తగ్గింపు (GST reduction) కారణంగా లాభం జరిగిందని వివరించారు.
Nizamabad MP | కార్లపై భారీ డిస్కౌంట్..
దేశంలో ఉన్న అన్ని కంపెనీలకు చెందిన కార్లమీద రూ. 70 వేల నుంచి మొదలుకొని అత్యధికంగా రూ.1.57 లక్షల వరకు రేట్లు తగ్గాయని దీనివల్ల రోడ్డు టాక్స్‌తో పాటు ఇన్సూరెన్స్ (road tax and insurance) కూడా తగ్గుతుందని అర్వింద్ పేర్కొన్నారు. ప్యాకెట్ పాలపైన ఐదు శాతం నుంచి సున్న శాతం, బ్రెడ్‌పైన ఐదు శాతానికి, డైరీ ప్రొడక్ట్స్ పైన 18 నుంచి 5 శాతం వరకు జీఎస్టీ తగ్గించడం జరిగిందన్నారు. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అయినటువంటి సబ్బులు, షాంపులు తదితరుల వాటిపైన 18 నుంచి 5 శాతం టాక్స్ తగ్గిందని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిరోజు మనం ఉపయోగించే నిత్యావసర వస్తువులు రూ.15 వేల కొంటే రూ.1,500 వరకు సేవ్ అవుతుందన్నారు. టూ వీలర్స్‌పై 28 నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గించడం వల్ల చిన్న వాహనం కొనుగోలుపై రూ.7 నుంచి రూ.8వేల ప్రజలకు ఆదా అవుతుందని ఎంపీ వివరించారు.
Nizamabad MP | ఇకనుంచి స్టేషనరీపై జీరో ట్రాక్స్
ప్రతిరోజు విద్యార్థులు ఉపయోగించే స్టేషనరీపై 12 శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలగించినట్లు ఎంపీ తెలిపారు. విద్యార్థులు ఉపయోగించే పెన్ను, పెన్సిల్, రబ్బర్, ఎరేజర్ వంటి వాటిపై ఇకనుంచి జీరో టాక్స్ ఉంటుందన్నారు. రిఫ్రిజిరేటర్ (refrigerators)లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 28 నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గించినట్లు చెప్పారు.
Nizamabad MP | ఇన్సూరెన్స్‌లపై జీరో టాక్స్
ఎల్ఐసీ, ఇతర ఇన్సూరెన్స్ ప్రీమియంలపై కేంద్ర ప్రభుత్వం (central government) టాక్స్‌ను పూర్తిగా రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది వరకు ఉన్న 18శాతం ట్యాక్స్ తొలగించడంతో ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు. ఒక వినియోగదారుడు ప్రతి ఏడాది సుమారు రూ.25 వేల ప్రీమియం చెల్లించినట్లయితే ట్యాక్స్ రద్దు చేసిన కారణంగా రూ. 4,500 అతనికి ఆదా ఆవుతుందన్నారు.
Nizamabad MP | ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు జీఎస్టీ సంపద
కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా వస్తున్న సంపద వల్ల దేశంలో 144 వందే భారత్ రైళ్లు వాడుకలోకి వచ్చాయన్నారు. అంతేకాకుండా డిఫెన్స్, రైల్వే శాఖ (defense and railway departments) అభివృద్ధి, 80 కోట్ల మంది భారతీయులకు ఉచిత రేషన్, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసిందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జీఎస్టీ తగ్గించడంతో రాష్ట్రానికి రూ.7వేల కోట్ల ఆదాయం పోతున్నదని నెత్తిమీద గుడ్డ వేసుకొని ఏడుపు ముఖం పెట్టాడని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, దిశా కమిటీ సభ్యులు హనుమంతరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.