- Advertisement -
HomeతెలంగాణMedaram Jathara | మేడారం గద్దెలను అభివృద్ధి చేస్తాం.. రూ.236 కోట్లతో పనులు : సీఎం...

Medaram Jathara | మేడారం గద్దెలను అభివృద్ధి చేస్తాం.. రూ.236 కోట్లతో పనులు : సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medaram Jathara | మేడారంలోని సమక్క, సారలమ్మ గద్దెలను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మంత్రులు, అధికారులతో కలిసి మేడారంను సందర్శించారు.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.236 కోట్లు ఖర్చుతో మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల ప్రాంగణ నిర్మాణం చేపడుతామన్నారు. వంద రోజుల్లోగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర కొనసాగనున్న విషయం తెలిసిందే. జాతర లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతామన్నారు. ఒకేసారి 10 వేల మంది భక్తులు దర్శించుకునేలా నిర్మాణం చేపడుతామని వెల్లడించారు.

- Advertisement -

Medaram Jathara | గత పాలకులు వివక్ష చూపారు

గత పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని సీఎం పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో తాను ఇక్కడి నుంచే పాదయాత్ర మొదలు పెట్టినట్లు గుర్తు చేశారు. ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు అన్నారు. వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు.

Medaram Jathara | జన్మ ధన్యమైనట్లే..

సమ్మక్క సారక్క(Sammakka Sarakka)ల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కకు, తనకు ఈ జన్మ ధన్యమైనట్లే అని రేవంత్​రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా మంజూరు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆదివాసీలను, పూజారులను, సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నట్లు వెల్లడించారు. మహా జాతర నాటికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

Medaram Jathara | జాతరను ఘనంగా చేసుకుందాం..

జాతరలోపు గద్దెల పునర్నిర్మాణం కావాలంటే రాత్రి, పగలు పనులు చేయాల్సి ఉంటుందని సీఎం అన్నారు. స్థానికుల సహకారం ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని చెప్పారు. మహాజాతరకు మళ్లీ వస్తానని, ఈసారి జాతరను గొప్పగా చేసుకుందామని సీఎం పేర్కొన్నారు. కుంభమేళాకు రూ.వేలకోట్లు ఇస్తున్న కేంద్రం… ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News