అక్షరటుడే, వెబ్డెస్క్ : Akhanda 2 | నందమూరి బాలయ్య కెరీర్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అఖండ చిత్రం మాత్రం ప్రత్యేకం అని చెప్పాలి. ఈ సినిమాకి ముందు కూడా బాలయ్య హిట్లు, సూపర్ హిట్లు కొట్టిన కూడా మార్కెట్ మాత్రం అంతంతగానే ఉండేది. కాని అఖండ తర్వాతే నట సింహం రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఈ సినిమాకి సీక్వెల్‌గా అఖండ 2 చిత్రం(Akhanda 2 Movie) రూపొందుతుండగా, ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ అంటేనే మాస్ మస్తీకి మరో పేరు. ఈ జోడీ కలిసిన ప్రతీసారీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తూ వచ్చారు. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలతో దుమ్మురేపిన ఈ కాంబో ఇప్పుడు మళ్లీ ‘అఖండ 2: తాండవం’ అంటూ మరోసారి సిల్వర్‌స్క్రీన్‌ను ఊపేందుకు సిద్ధమవుతోంది.
Akhanda 2 | క్లారిటీ ఇచ్చారు..
అయితే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల కావలసిన ఈ సినిమా వాయిదా పడింది. తొలుత పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా పోటీ ఉండకూడదనే మూవీని పోస్ట్ పోన్ చేశారని వార్తలు వచ్చాయి. దాంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఊపందుకున్నాయి. కాని బాలయ్య(Bala Krishna) ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. అఖండ 2 సెప్టెంబర్ 25న రావడం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి టైమ్ కుదరకపోవడం వల్లే వాయిదా పడింది. మొదటి భాగానికే సబ్ వూఫర్లు పేలిపోయాయి.. ఇప్పుడు ఆ స్టాండర్డ్‌ని మించి బీట్స్ ఉండాలి కదా..! అఖండకు రెట్టింపు కాదు, దానికి ఐదు రెట్లు తాండవం ఉంటుంది. మంచి ఉద్దేశ్యంతో సినిమా తీశాం,” అని వెల్లడించారు.
అయితే తాజాగా అసెంబ్లీ లాబీలో బాలకృష్ణ తనకి ఎదురుపడిన ఎమ్మెల్యేలు, మిత్రులతో చిట్ చాట్ చేయగా, వారు అఖండ 2 ఎప్పుడు అని అడిగారు. దానికి స్పందించిన ఆయన ఎల్లుండి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా వస్తుంది. అఖండ 2 డిసెంబర్ 5న వస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని తీసుకొస్తున్నామని చెప్పిన బాలయ్య, హిందీ డబ్బింగ్ కూడా బాగా వచ్చిందని స్పష్టం చేశారు. అంతటా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.