- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Alfors School | ఆల్ఫోర్స్ పాఠశాలకు నోటీస్​ జారీ.. ఎందుకంటే..?

Alfors School | ఆల్ఫోర్స్ పాఠశాలకు నోటీస్​ జారీ.. ఎందుకంటే..?

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Alfors School | సెలవుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్న ఓ విద్యాసంస్థకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని అల్ఫోర్స్​ పాఠశాల (Alfors School) దసరా సెలవుల్లోనూ (Dussehra holiday) పరీక్షల పేరుతో తరగతులు నిర్వహిస్తున్నట్లుగా విద్యాశాఖకు ఫిర్యాదు అందింది.

దీంతో స్పందించిన ఎంఈవో రాజా గంగారాం (MEO Raja Gangaram) పాఠశాలకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో సెలవు రోజుల్లో పిల్లల్ని పాఠశాలకు రప్పించవద్దని సూచించారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Alfors School | చాలా స్కూళ్లల్లో ఇదే పరిస్థితి..

జిల్లాలోని చాలావరకు కార్పొరోట్​ స్కూళ్లల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. విద్యార్థులకు ఇచ్చిన దసరా సెలవులను నిర్వీర్యం చేస్తూ తరగతులను నిర్వహిస్తున్నారు. దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు ఒకింత ఆగ్రహానికి గురవుతున్నప్పటికీ.. తమ పిల్లల ఎక్కడ వెనకబడిపోతారేమోనని ఆలోచనలతో మిన్నకుండిపోతున్నారు. అన్నీ తెలిసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News