అక్షరటుడే, బోధన్ : Dog Bite | బోధన్(Bodhan) పట్టణంలో వీధికుక్కలు వీరవిహారం చేస్తున్నాయి. చిన్నారులను గాయపరుస్తున్నాయి. కుక్కల వల్ల చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మున్సిపల్ సిబ్బంది(Municipal Staff)కి ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Dog Bite | బోధన్ పట్టణంలో..
బోధన్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో వీధికుక్కలు(Street Dogs) మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు చిన్నారులను గాయపర్చాయి. వార్డులోని మూడేళ్ల అనిషా అనే బాలికను, రెండేళ్ల షేక్ ఉమర్‌ను విచక్షణారహితంగా కరిచాయి. వెంటనే వారి కుటుంబీకులు బోధన్ ఆస్పత్రి(Bodhan Hospital)కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీధికుక్కల సమస్యకు పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.