అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | మెడికల్ కళాశాల ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌పై దాడికి నిరసగా నగరలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో (District General Hospital ) మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు, వైద్యవిద్యార్థులు (medical students) మాట్లాడుతూ.. మహబూబాబాద్ మెడికల్ కళాశాల (Mahabubabad Medical College) అనుబంధ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌పై అమానుషంగా దాడిచేసిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అపస్మారక స్థితిలో 60 శాతం కన్నా తక్కువ ఆక్సిజన్ శాతంతో వచ్చిన రోగి ఆస్పత్రిలో మరణిస్తే.. మరణానంతరం ఆ రోగి బంధువులు వైద్యులపై, మెడికల్ సూపరింటెండెంట్‌పై దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాకు భద్రత కల్పిస్తేనే స్వేచ్ఛగా ప్రజలకు సేవ చేయగలుగుతామని వారు పేర్కొన్నారు.
వైద్యులకు సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని కోరారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషల్ పోలీసు ప్రొటెక్షన్ (special police protection) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్యులు గౌరవప్రదంగా పనిచేయడానికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు(TTGDA), తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినధులు (TJUDA) నిరసనలో పాల్గొన్నారు.