ePaper
More
    Homeసినిమాanu aggarwal | ప‌రేష్ రావ‌లే కాదు, ఆ న‌టి కూడా త‌న యూరిన్ తానే...

    anu aggarwal | ప‌రేష్ రావ‌లే కాదు, ఆ న‌టి కూడా త‌న యూరిన్ తానే తాగుతుంద‌ట‌.. అమృతం అంటుందిగా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: anu aggarwal | చిరంజీవి Chiranjeevi ‘శంకర్ దాదా MBBS’లో డాక్టర్ రామ లింగేశ్వరరావు, అలియాస్ “లింగం మామా” పాత్రలో న‌టించి అల‌రించిన ప‌రేష్ రావ‌ల్ Paresh Raval మీరంద‌రికి గుర్తుండే ఉంటాడు. గ‌తంలో ఆయ‌న క్ష‌ణ క్ష‌ణం, మ‌నీ సినిమాల‌లో కూడా న‌టించాడు. బాలీవుడ్‌లో Bollywood ఎన్నో చిత్రాల‌లో న‌టించి మెప్పించాడు. 1955, మే 30న ఒక సాధారణ గుజరాతీ కుటుంబంలో పుట్టిన పరేష్ రావల్ మొద‌ట్లో చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. అప్పటి తన గర్ల్‌ఫ్రెండ్, 1979 మిస్ ఇండియా Miss India, నటి అయిన స్వరూప్ సంపత్ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు 1987లో పెళ్లి చేసుకున్నారు, వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

    anu aggarwal | ఇదెక్క‌డి గోల‌..

    ఇటీవల పరేష్ రావల్ Paresh raval తన జీవితంలో జరిగిన ఒక షాకింగ్, వింత సంఘటన గురించి చెప్పుకొచ్చి షాకిచ్చాడు. ఒకసారి అతని మోకాలికి పెద్ద గాయం అవ్వడంతో ముంబైలోని mumbai నానావతి హాస్పిటల్‌లో Nanavati Hospital చికిత్స తీసుకుంటుండ‌గా, అతన్ని చూడటానికి స్టార్ హీరో అజయ్ దేవగన్ star hero Ajay Devgan తండ్రి, యాక్షన్ డైరెక్టర్ వీరూ దేవగన్ వచ్చాడు. అతడు పరేష్ రావల్‌కి Paresh raval ఊహించని సలహా ఇచ్చారు. గాయం త్వరగా మానాలంటే రోజూ ఉదయం సొంత మూత్రాన్ని urine తాగమని చెప్పాడట‌.. ఏకంగా 15 రోజుల పాటు దాన్ని పాటించాడు. ఒకేసారి గటగటా తాగకుండా, బీర్‌లా మెల్లగా సిప్ చేశాను అని అన్నాడు. దీనిని చాలా మంది ఖండించారు.

    అయితే 1990లో విడుద‌లైన ఆషికి సినిమాతో Aashiqui movie ఫేమ‌స్ అయిన అను అగర్వాల్ anu aggarwal హీరోయిన్. తాను కూడా యూరిన్ urine తాగినట్లు ఆవిడ తెలిపారు. యూరిన్ తాగడం యోగాలో ఒక ముద్ర yoga mudra అని అను అగర్వాల్ anu aggarwal తెలిపారు. యూరిన్ తాగడాన్ని ఆమ్రోలి అంటారు. యోగాలో అది ఒక ముద్ర. నేను ప్రాక్టీస్ చేశాను. మనం యూరిన్ అంతా తాగాల్సిన అవసరం లేదు. అందులో కొంత వరకు తీసుకుంటే చాలు. యాంటీ ఏజింగ్ విషయంలో హెల్ప్ అవుతుంది. ముడ‌త‌లు పోతాయి అని అన్నారు. మ‌రి యూరిన్ తాగడం మంచిది కాదని వైద్యులు doctors చెబుతున్నారని , సైన్స్ పరంగా సపోర్ట్ కూడా లేదని ప్రశ్నించగా… ”సైన్స్ ఎప్పటిది? 200 ఏళ్ళు?? యోగా 1000 ఏళ్ల నుంచి ఉంది. మీరు రెండిటిలో దేనిని నమ్ముతారు అంటూ అను ప్ర‌శ్నించింది.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...