అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Katrina Kaif | బాలీవుడ్ జంట విక్కీ కౌషాల్, కత్రినా కైఫ్ తమ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు కత్రినా మంగళవారం తన ఇన్‌స్ట్రామ్(Instagaram)లో పోస్టు చేసింది. తాను తొలిసారి తల్లి కాబోతున్నానని ప్రకటిస్తూ బేబీ బంప్(Baby Bump)తో ఉన్న ఫొటోను పంచుకుంది. గత కొన్ని నెలలుగా ఈ జంటకు సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తమ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంతోషకరమైన వార్తను కత్రినా, విక్కీ తాజాగా వెల్లడించారు.
Katrina Kaif | కొత్త అధ్యాయనం షురూ..
కత్రినా, విక్కీ బేబీ బంప్‌ను తాకుతున్న పోలరాయిడ్ ఫొటోను షేర్ చేసింది. ‘ఆనందం, కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మా జీవితంలోని ఉత్తమ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ఓం,’ అని ఫొటో క్యాప్షన్ పెట్టి ఇన్‌స్టాలో షేర్ చేశారు.
Katrina Kaif | విజయవంతమైన ప్రేమకథ
బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్ (Katrina Kaif), విక్కీ కౌషల్ (Vicky Kaushal) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన ప్రేమకథలలో వీరిది ఒకటిగా నిలిచింది. కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ 2019లో ఒక చాట్ షోలో కలిసి కనిపించిన తర్వాత వీరి ప్రేమ గురించి చర్చ మొదలైంది. ఈ షోలో విక్కీ ఆమెకు సరదాగా ప్రపోజ్ చేశాడు. వారిద్దరూ తమ సంబంధాన్ని చాలావరకు రహస్యంగా ఉంచుకున్నప్పటికీ, పార్టీలు, కుటుంబ సమావేశాలలో తరచూ కనిపించడంతో ఊహాగానాలకు బలం చేకూర్చింది. అయినప్పటికీ ఈ జంట తమ ప్రేమను ఎప్పుడూ బహిరంగంగా ధ్రువీకరించలేదు. అయితే, డిసెంబర్ 9, 2021న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో జరిగిన గొప్ప వేడుకలో కత్రినా, విక్కీ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్నారు. కత్రినా అక్టోబర్‌లో డెలివరీ కానుందని తెలిసింది.