- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | రెచ్చిపోయిన దొంగలు.. 30 తులాల బంగారం చోరీ

Nizamabad | రెచ్చిపోయిన దొంగలు.. 30 తులాల బంగారం చోరీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నిజామాబాద్​ నగరంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడి 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

నగరంలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నాగారం (Nagaram)లోని బ్రాహ్మణ కాలనీకి చెందిన పవన్ శర్మ ఇంటికి తాళం వేసి పూజకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఆయన ఇంట్లో చోరీ జరిగింది. ఇద్దరు యువకులు బైక్​పై వచ్చి తాళం పగుల గొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.

- Advertisement -

లాకర్​లో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐదో టౌన్​ పోలీసులు (Fifth Town Police) ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News