HIT-3 | బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ 3 ఊచ‌కోత‌.. రెండు రోజుల్లో రికార్డ్ క‌లెక్ష‌న్స్
HIT-3 | బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ 3 ఊచ‌కోత‌.. రెండు రోజుల్లో రికార్డ్ క‌లెక్ష‌న్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్: HIT-3 | నేచురల్ స్టార్ నాని Nani న‌టించిన తాజా చిత్రం ‘హిట్- 3’ (హిట్ : ది థర్డ్ కేస్). భారీ అంచ‌నాల న‌డుమ మే 1న థియేట‌ర్స్ లోకి వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. దర్శకుడు శైలేష్ కొలను(Director Sailesh Kolanu) తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి తెగ న‌చ్చేసింది. కాస్త వ‌యోలెన్స్ ఉన్నా కూడా మూవీని చూసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో మూవీకి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్​వైడ్(World Wide)​గా రూ.43కోట్లు సాధించి నాని కెరీర్​లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇక రెండో రోజూ కూడా డీసెంట్ కలెక్షన్లు సాధించింది.

HIT-3 | హిట్ ప్ర‌భంజ‌నం..

శుక్రవారం ఈ మూవీ రూ.19 కోట్లు (గ్రాస్) వసూల్ చేసింది. దీంతో 2 రోజుల్లోనే హిట్ 3(HIT-3) ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్ల (గ్రాస్) మార్క్ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ‘బాక్సీఫీస్ వద్ద అర్జున్ సర్కార్ వేట కొనసాగుతోంది’ అని క్యాప్షన్ తో పోస్ట్ వ‌దిలారు. ఇక వారాంతం అయిన శనివారం, ఆదివారం.. మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

ఈ వీకెండ్ ముగిసే సమయానికి రూ.100 కోట్ల మార్క్​ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. కాగా, ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్​ మై షో Book my showలో నాని సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓపెనింగ్ రోజు 2.70 లక్షల టికెట్లు అమ్ముడవ్వగా, డే 2న 2.06 లక్షల టికెట్లు సోల్డ్ అయినట్లు బుక్ మై షో స్ప‌ష్టం చేసింది.

వీకెండ్​లో టికెట్ సేల్స్, కలెక్షన్లు భారీగా పెర‌గ‌నున్న‌ట్టు చెబుతున్నారు. మొత్తానికి నాని(Nani) ఏది ప‌ట్టుకున్నా కూడా బంగార‌బ‌మే అవుతుంది. న‌టుడిగా, నిర్మాత‌గా మంచి విజ‌యాలు సాధిస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే, ‘హిట్’ యూనివర్స్​లో భాగంగా తెరకెక్కిన మూడో సినిమా ‘హిట్ : ది థర్డ్ కేస్(The Third Case) చిత్రంలో కేజీఎఫ్ KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్​గా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిచారు. సాను జాన్‌ వర్ఘీస్ ఛాయాగ్రహణం బాధ్యతలు చూశారు. హిట్ 3కి కొనసాగింపుగా హిట్ 4 రూపొందుతుండ‌గా, ఇందులో కార్తీ (Karthi) న‌టించ‌నున్నాడు.