అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మెట్రో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
నగరంలో మంగళవారం ఉదయం మెట్రో రైలు సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. భరత్‌నగర్ (Bharat Nagar) స్టేషన్‌లో 8 నిమిషాలకి పైగా ట్రైన్ ఆగిపోవడంతో ప్రయాణికులు కంగారుపడ్డారు. అనంతరం సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించారు. దీంతో రైలు సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
నగరంలో గతంలో సైతం పలుమార్లు సాంకేతిక కారణాలతో మెట్రో రైలు నిలిచిపోయింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్‌లో వెళ్తున్న మెట్రో రైలు భరత్ నగర్ స్టేషన్‌లో మే నెలలో సైతం ఆగిపోయింది. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా నగరంలో నిత్యం మెట్రో రైళ్లలో వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. అలాంటి మెట్రో ట్రైన్లు సడెన్‌గా ఆగిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.