- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిMLA Pocharam | ప్రజల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే పోచారం

MLA Pocharam | ప్రజల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే పోచారం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ : MLA Pocharam | ప్రజల సంక్షేమమే సర్కారు లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మంగళవారం రాష్ట్ర ఆగ్రో ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో (Kasula Balaraj) కలిసి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు సరైన రీతిలో అర్హులకు అందేవిధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో (Telangana) అమలవుతున్న పథకాలను దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ యామ రాములు, సొసైటీ ఛైర్మన్ ఇంగు రాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని శంకర్, సీనియర్ నాయకులు బస్వరాజ్ పటేల్, శశికాంత్, సందీప్, రఘు, కాంత్ రెడ్డి, గంగారం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News