- Advertisement -
HomeజాతీయంMaoists | కోవర్ట్​ ఆపరేషన్‌తో మావోయిస్ట్ అగ్రనేతల ఎన్‌కౌంటర్లు!

Maoists | కోవర్ట్​ ఆపరేషన్‌తో మావోయిస్ట్ అగ్రనేతల ఎన్‌కౌంటర్లు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బల వెనుక కోవర్ట్​ ఆపరేషన్​ (covert operation) ఉన్నట్లు సమాచారం. దీంతోనే ఇటీవల కీలక నేతలు హతం అవుతున్నట్లు పార్టీ పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం (central government) 2026 మార్చి వరకు దేశంలో నక్సల్స్​ లేకుండా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) చేపట్టి వేల సంఖ్యలో బలగాలతో అడవులను జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో వందలాది ఎన్​కౌంటర్లు చోటు చేసుకొని అనేక మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే గతంలో దళ సభ్యులు మాత్రమే ఎన్​కౌంటర్లలో చనిపోయేవారు. ఇటీవల కీలక నేతలే లక్ష్యంగా బలగాలు కూంబింగ్​ చేపడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు అగ్రనేతలను బలగాలు మట్టుబెట్టాయి.

- Advertisement -

Maoists | అప్పటి నుంచి..

మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీ నంబాల కేశవరావు (Nambala Kesava Rao) మే 21న ఎన్​కౌంటర్​లో చనిపోయారు. ఆయనతో పాటు 27 మంది ఈ ఎన్​కౌంటర్​లో మృతి చెందారు. అయితే ఆయన ఎన్​కౌంటర్​ కూడా కోవర్ట్​ ఆపరేషన్​తోనే చేపట్టినట్లు పౌర హక్కుల సంఘాలు (civil rights groups) ఆరోపిస్తున్నాయి.

Maoists | నక్సల్స్​ను పోలీసుల్లో చేర్పించిన నంబాల

మావోయిస్టులు, పోలీసులు ఇన్​ఫార్మర్లను పెట్టుకోవడం, కోవర్టు ఆపరేషన్లు నిర్వహించడం చేస్తుంటారు. ఈ క్రమంలో నంబాల కేశవరావు తన దగ్గర పనిచేసే ఐదుగురిని ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ DRGలో చేర్పించినట్లు సమాచారం. అనంతరం నంబాల దగ్గర పని చేసే ఇద్దరు నక్సల్స్ (Naxals) లొంగిపోయారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కోవర్ట్​ ఆపరేషషన్​ నిర్వహించినట్లు తెలిసింది. అంతేగాకుండా పోలీసుల ముసుగులో ఉన్న మావోయిస్టులను సైతం కనిపెట్టారు. అనంతరం వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Maoists | నంబాల కదలికలు కనిపెట్టి..

నంబాల ప్లాన్​ తెలిసిపోవడంతో పోలీసులు, బలగాలు ఆయన కదలికలపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో మే 21న జరిగిన ఎన్​కౌంటర్​లో ఆయనను హతమార్చాయి. తాజాగా మరో ఇద్దరు కీలక నేతలు సైతం కోవర్టు ఆపరేషన్​తోనే మృతి చెందినట్లు నక్సల్స్​ పేర్కొంటున్నారు. తెలంగాణకు (Telangana) చెందిన సత్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లో హతమయ్యారు. కోవర్టు ఆపరేషన్​తోనే బలగాలు ఎన్​కౌంటర్లు చేపడుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News