అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shalini Pandey | టాలీవుడ్లో ఒక్క హిట్ వస్తే చాలు వారి దశ తిరుగుతుంది అని అంటారు. కొందరు హీరోయిన్స్ మాత్రం వచ్చిన ఆ ఒక్క ఛాన్స్‌ను బాగా వాడుకుని స్టార్డమ్ అందుకుంటే, మరికొందరు తొలి విజయం తర్వాత జాడ లేకుండా పోతుంటారు.
అలాంటి పరిస్థితే ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ఫేమ్ షాలిని పాండే ఎదుర్కొంటోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలైన అర్జున్ రెడ్డి (2017) సినిమాతో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన షాలినికి, ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ఓవర్‌నైట్‌గా స్టార్ ఇమేజ్ వచ్చింది. విజయం తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చినా, అవి అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పటివరకు ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి సుమారు 12 సినిమాల్లో నటించింది.
Shalini Pandey | హ్యాపీ బర్త్ డే..
అర్జున్ రెడ్డి తర్వాత నటించిన సినిమాల్లో ఏ సినిమా కూడా ఈ అమ్మడి ఫేట్ మార్చలేకపోయాయి. అయితే ఒకటి రెండు సినిమాలు (118 వంటి సినిమాలు) సరే అనిపించినా, మిగతావన్నీ ఫ్లాప్ టాక్‌నే మూటగట్టుకున్నాయి. సినిమాల్లో ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేకపోయినా, షాలిని సోషల్ మీడియా ద్వారా మాత్రం సందడి చేస్తూనే ఉంది. తరచూ గ్లామరస్ ఫోటోషూట్స్, స్టైలిష్ లుక్స్‌తో నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ, అభిమానుల నుంచి బోలెడు రెస్పాన్స్ అందుకుంటున్నాయి. కామెంట్లలో చాలామంది ఆమె అందానికి ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అభినయం, అందం రెండూ ఉన్నా కెరీర్లో మాత్రం నిలదొక్కుకోలేకపోవడం ఆమె అభిమానులని ఎంతో బాధిస్తుంది. బాలీవుడ్లో కూడా ప్రయోగాలు చేస్తున్న షాలిని, మళ్లీ ఓ మేజర్ హిట్‌తో రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం కెరీర్లో కాస్త వెనుకబడిన ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియా హవాతో మాత్రం కుర్రకారును మాయ చేస్తోంది. అయితే ఈ రోజు ఈ అమ్మడి బర్త్ డే కాగా, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు షాలిని పాండేకి (Shalini Pandey) విషెస్‌ల వెల్లువ కురిపిస్తున్నారు. కాగా, షాలిని పాండే సెప్టెంబర్ 23, 1993న జన్మించింది. నేటితో ఈ అమ్మడు 32వ వసంతంలోకి అడుగుపెట్టింది.