- Advertisement -
Homeక్రీడలుRishabh Pant | విండీస్‌తో టెస్టు సిరీస్‌కు రిష‌బ్ పంత్ దూరం.. ధ్రువ్ జురెల్, పడిక్కల్‌కి...

Rishabh Pant | విండీస్‌తో టెస్టు సిరీస్‌కు రిష‌బ్ పంత్ దూరం.. ధ్రువ్ జురెల్, పడిక్కల్‌కి అవకాశం!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rishabh Pant | ఆసియాకప్ 2025 తర్వాత టీమ్ ఇండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో (West Indies) రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 2న ప్రారంభం కానుండగా, భారత్ జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించే అవకాశం ఉంది.

అయితే ఈ సిరీస్‌కు కీలక ఆటగాడు రిషబ్ పంత్ (Rishabh Pant) అందుబాటులో ఉండడని సమాచారం అందుతోంది. ఈ వార్త‌తో అభిమానులు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో నాలుగో టెస్టు సందర్భంగా పంత్ కాలికి గాయమవడంతో, అప్పటి నుంచి అతను విశ్రాంతిలోనే ఉన్నాడు. దీంతో ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుతో పాటు ఆసియాకప్ 2025కు కూడా అతడు దూరంగా ఉండాల్సి వచ్చింది.

- Advertisement -

Rishabh Pant | పంత్ ఎప్పుడు వ‌స్తాడు..

ప్రస్తుతం పంత్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో (BCCI Centre of Excellence) పునరావాస శిక్షణలో ఉన్నాడు. అయితే గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో, పంత్‌కు విండీస్‌తో టెస్టు సిరీస్‌తో పాటు అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో వైట్ బాల్ సిరీస్ కూడా మిస్ అయ్యే అవకాశముందని సమాచారం. పంత్ మళ్లీ ఎప్పుడు మైదానంలోకి వస్తాడు అనే దానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. రిషబ్ పంత్ దూరమవడంతో, విండీస్ సిరీస్‌కు వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌కి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ అతడు ఈ బాధ్యతలు నిర్వర్తించాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టులో 140 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. అలాగే అదే మ్యాచ్‌లో 150 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్ కూడా సెలెక్షన్ రేసులో ఉన్నాడు. టీమిండియాలో బ్యాటింగ్ విభాగంలో అతడికి అవకాశం దక్కే అవకాశం ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లాండ్ పర్యటనతో రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో అతడి ఎంపికపై సందిగ్ధత నెలకొంది. ఇక శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లయితే, ఈ సిరీస్‌లో తిరిగి చోటుదక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ షెడ్యూల్:

మొదటి టెస్టు మ్యాచ్
అక్టోబర్ 2–6, అహ్మదాబాద్

రెండో టెస్టు మ్యాచ్
అక్టోబర్ 10–14, ఢిల్లీ

- Advertisement -
- Advertisement -
Must Read
Related News