అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | యూఎస్ కొత్త హెచ్-1 బీ వీసాల ఫీజు విషయంలో ఆందోళన కొనసాగుతోంది. ఐటీ షేర్ల(IT Shares)లో పతనం ఆగడం లేదు. హెవీ వెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, నెస్లే స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో ప్రధాన సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
మంగళవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 12 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైనా వెంటనే కోలుకుని 160 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే గరిష్టాలనుంచి 486 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 2 పాయింట్ల లాభంతో ప్రారంభమై 41 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 164 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 361 పాయింట్ల నష్టంతో 81,798 వద్ద, నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 25,100 వద్ద ఉన్నాయి. రూపాయి(Rupee) బలహీనంగా ట్రేడ్ అవుతోంది. మంగళవారం 25 పైసలు క్షీణించి రూ. 88.53 వద్ద జీవనకాల కనిష్టానికి చేరింది.
ఎఫ్ఎంసీజీ, ఐటీలలో అమ్మకాల ఒత్తిడి..
ఎఫ్ఎంసీజీ(FMCG), ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురవుతుండగా.. ఆటో రంగ షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్ఈలో ఆటో ఇండెక్స్(Auto index) 0.85 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.20 శాతం లాభాలతో సాగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.09 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.94 శాతం, ఐటీ 80 శాతం, రియాలిటీ 0.77 శాతం, హెల్త్‌కేర్ 0.59 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.54 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.44 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.42 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.39 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో ఉండగా.. 20 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. మారుతి 1.79 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.75 శాతం, ఎంఅండ్ఎం 0.82 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 0.60 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.53 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers | ట్రెంట్ 2.09 శాతం, టెక్ మహీంద్రా 1.84 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.79 శాతం, అసియా పెయింట్ 1.56 శాతం, ఎటర్నల్ 1.43 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.