అక్షరటుడే, బోధన్ : Bodhan | చెరువలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్(Bodhan Rural SI Machender) తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలంలోని ఏరాజ్పల్లి గ్రామానికి(Erajpalli Village) చెందిన యువకుడు సుప్పల సాయిలు కూలీ పనిచేసుకునేవాడు.
రెండురోజులుగా అతడు అదృశ్యం కావడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే మంగళవారం ఉదయం గ్రామంలోని చెరువు కట్టపై గంగమ్మ గుడి(Gangamma Temple) వద్ద సాయిలుకు చెందిన ఫోన్, చెప్పులు, బండి ఉండడంతో గ్రామస్థులు గమనించగా.. చెరువులో మృతదేహం కనిపించింది. కుటుంబ కలహాలతో సాయిలు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.