అక్షరటుడే, గాంధారి/బాన్సువాడ : 108 Ambulance | అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది స్పందించారు. అంబులెన్స్లలోనే డెలివరీలు నిర్వహించి తల్లీబిడ్డలను కాపాడారు. గాంధారి మండలం(Gandhari Mandal) కరక్‌వాడి గ్రామానికి చెందిన మమతకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో మంగళవారంవ ఉదయం ఆమె భర్త మహేష్ 108 సిబ్బందికి ఫోన్ చేశాడు.
వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది(Ambulance Staff) రమేశ్, అస్లాం కలిసి మహేష్ ఇంటికి చేరుకుని కామారెడ్డి జీజీహెచ్‌కు తరలిస్తున్న సమయంలో మర్గమధ్యంలో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వాహనాన్ని నిలిపేసి అంబులెన్స్‌లోనే నార్మల్ డెలివరీ(Normal Delivery) నిర్వహించారు. తల్లీబాబు క్షేమంగా ఉంటారు. అనంతరం 198 ఈఆర్సీసీపీ వైద్యడు శివ సలహాతో ఆస్పత్రికి తరలించారు. అత్యవసర స్థితిలో స్పందించిన అంబులెన్స్ సిబ్బందికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
108 Ambulance | బాన్సువాడలో..
అక్షరటుడే, బాన్సువాడ : పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసముంటున్న సుమలతకు పురిటినొప్పులు ఎక్కువ కాగా.. బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిలో చేరింది. లోపల శిశువు మెకోణియం (మలవిసర్జన) చేసినట్లు వైద్యులు గుర్తించి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. స్పందించిన 108 సిబ్బంది అంబులెన్స్‌లో సుమలతను తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఆర్సీసీపీ శివ సూచనల మేరకు అంబులెన్స్ సిబ్బంది రోడ్డు పక్కనే సురక్షితంగా సాధారణ కాన్పు చేశారు. ఈ సందర్భంగా సుమలత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారు. చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి(Nizamabad Government Hospital)కి తరలించారు. అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ ప్రసాద్, పైలట్ సుభాష్‌కు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.