అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dussehra Holidays | పవన్ కల్యాణ్ అభిమానులకు ముందే దసరా రానుంది. సెప్టెంబర్ 25న ఓజీ చిత్రం (OG Movie) భారీ లెవల్‌లో విడుదల కానుండగా, ఈ సినిమా కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం దసరా పండుగకు తెలుగులో విడుదలవుతున్న ఏకైక పెద్ద సినిమా కావడంతో, పవర్ స్టార్ అభిమానుల్లో ఊహించని ఉత్సాహం నెలకొంది.
అదే సమయంలో, బాలీవుడ్ ప్రేక్షకుల కోసం ఆస్కార్ నామినేటెడ్ మూవీ ‘హౌమ్ బౌండ్’ (Home Bound) కూడా హిందీలో సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఇక ఈ సినిమాల తర్వాత మళ్లీ అందరి దృష్టి అక్టోబర్ 2న విడుదల కానున్న కాంతార చాప్టర్-1 చిత్రంపై ఉంది. రీసెంట్‌గా మూవీ ట్రైలర్ విడుదల కాగా.. ఇది చిత్రంపై భారీ అంచనాలు పెంచింది.
Dussehra Holidays | సందడే సందడి..
అక్టోబర్ 1న ఇడ్లీ కొట్టు (తెలుగు డబ్) విడుదల కానుండగా, శశివదనే అక్టోబర్ 10, 2025న విడుదల కానుంది. ఇక అఖండ 2 డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ కానున్నట్టు సమాచారం. అయితే థియేటర్స్‌తో పాటు ఓటీటీ ప్రేక్షకులకూ ఈ వారం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. పలు కొత్త వెబ్ సిరీస్‌లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో (OTT Platforms) విడుదలకు సిద్ధమయ్యాయి. ఆహాలో ‘జూనియర్’ అనే తెలుగు సినిమా సెప్టెంబర్ 22 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. సెప్టెంబర్ 26న ‘ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా’ అనే డబ్బింగ్ మూవీ, ‘ది గెస్ట్’, ‘అలైస్’, ‘మాంటిస్’, ‘హౌస్ ఆఫ్ గిన్నీస్’ వంటి ఇంగ్లిష్ సినిమాలు, సిరీస్‌లు విడుదల కానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 24న ‘హోటల్ కాస్టైరా’, సెప్టెంబర్ 25న ‘కొకైనా క్వార్టర్ బ్యాక్’, ‘టూమచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్’ అనే హిందీ టాక్ షో, సెప్టెంబర్ 26న కన్నడ మూవీ ‘మాదేవా’ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమా (హాట్‌స్టార్)లో సెప్టెంబర్ 23న ‘సుందరకాండ’ అనే తెలుగు సినిమా, సెప్టెంబర్ 24న ‘ది డెవిల్ ఈజ్ బిజీ’ అనే డాక్యుమెంటరీ, సెప్టెంబర్ 26న ‘హృదయపూర్వం’ డబ్బింగ్ మూవీ, ‘మార్వెల్ జాంబియాస్’, ‘ద బల్లాడ్ ఆఫ్ వల్లిస్ ఐలాండ్’, ‘ఉమన్ ఇన్ ద యార్డ్’, ‘ద ఫ్రెండ్’, ‘డెత్ ఆఫ్ ఏ యూనికార్న్’ లాంటి చిత్రాలు విడుదల కానున్నాయి. సన్ నెక్స్ట్‌లో సెప్టెంబర్ 26న కన్నడ చిత్రం ‘దూరతీర యానా’, జీ5లో సెప్టెంబర్ 26న ‘జనావర్’ అనే హిందీ సిరీస్, ‘సుమతి వళవు’ అనే తెలుగు డబ్బింగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతాయి.
ఆపిల్ ప్లస్ టీవీలో సెప్టెంబర్ 24న ‘స్లో హార్సస్ సీజన్ 5’, సెప్టెంబర్ 26న ‘ఆల్ ఆఫ్ యూ’, ‘ద సావంత్’ అనే సిరీస్‌లు విడుదల కానున్నాయి. లయన్స్ గేట్ ప్లేలో ‘డేంజరస్ యానిమల్స్’ అనే ఇంగ్లిష్ సినిమా కూడా సెప్టెంబర్ 26న స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. మనోరమ మ్యాక్స్‌లో మలయాళ సినిమా ‘సర్తీక్’, ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో హిందీ సిరీస్ ‘సిక్సర్ సీజన్ 2’ సెప్టెంబర్ 24న స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తంగా సెప్టెంబర్ చివరి వారం థియేటర్లు, ఓటీటీలు అన్నీ సందడిగా మారనున్నాయి. సినిమా ప్రేమికులకు పండుగ వాతావరణమే!