అక్షరటుడే, తిరుమల: donations to Tirumala Srivaru | తిరుమల Tirumala శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి విరాళాలు, ఖరీదైన కానుకలు వరుసగా అందుతున్నాయి. సోమవారం చెన్నైకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు స్వామివారికి రూ. ఒక కోటి విలువ చేసే తొమ్మిది బంగారు పతకాలను దానం చేశారు. సాధారణ రాళ్లు పొదిగిన ఈ పతకాలను ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులకు అందజేశారు. ఇక శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి బహుకరించారు.
donations to Tirumala Srivaru | భారీగా అందుతున్న విరాళాలు..
ఈ కార్యక్రమంలో పేష్కార్ రామకృష్ణ, బొక్కసం ఇన్‌చార్జ్ గురురాజ్ స్వామి తదితర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సన్నాహాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ చాప, తాడు ను కూడా టిటిడి అటవీ విభాగం తరఫున ఆలయానికి తీసుకువచ్చారు. డీఎఫ్‌వో ఫణి కుమార్ Phani Kumar నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ఊరేగింపుగా వాటిని రంగనాయకుల మండపానికి తీసుకెళ్లి శేషవాహనంపై ఉంచారు. ఈ నెల 24న సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంలో వీటిని వినియోగించనున్నారు.
అటవీశాఖ సిబ్బంది సిద్ధం చేసిన ఈ దర్భ చాప 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు, 60 కిలోల బరువు కలిగి ఉంది. అలాగే 255 మీటర్ల పొడవు గల తాడు 106 కిలోల బరువుతో తయారు చేశారు. వేదోక్త శాస్త్రాలలో పవిత్రమైనదిగా చెప్పబడే విష్ణు దర్భ ను ఉపయోగించి వీటిని ప్రత్యేకంగా తయారు చేశారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా గరుడ పతాకాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తారు. తిరుమలలోTirumala శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ భక్తుల భక్తి, విరాళాలు, వేదసంప్రదాయాలు కలగలిసి వైభవంగా కొనసాగుతున్నాయి.